ప్రాణ ప్రతిష్టలో ప్రత్యేక ఆకర్షణగా అలియా భట్‌ చీర..ఏకంగా..! | Alia Bhatts Saree For Ayodhya Ram Mandir Visit Took 100 Hours Of Effort’, | Sakshi
Sakshi News home page

ప్రాణ ప్రతిష్టలో ప్రత్యేక ఆకర్షణగా అలియా భట్‌ చీర..ఏకంగా..!

Jan 24 2024 5:05 PM | Updated on Jan 24 2024 5:31 PM

Alia Bhatts Saree For Ayodhya Ram Mandir Visit Took 100 Hours Of Effort’, - Sakshi

అయోధ్యలో 500 ఏళ్ల నిరీక్షణకు తెరతీస్తూ బాలరాముడి ప్రాణ ప్రతిష్ట ప్రధాన నరేంద్ర మోదీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే అయోధ్యలోని ఈ కార్యక్రమంలో  ప్రముఖులు సెలబ్రెటీలు పెద్ద ఎత్తున తరలివచ్చి మరీ పాలు పంచుకున్నారు కూడా. ఈ వేడుకలో బాలీవుడ్‌ నటి అలియా భట్‌ నీలిరంగు మైసూర్‌ చీర తళక్కుమన్న సంగతి తెలిసిందే. ఆమె భర్త కూడా ఈ మహోత్సవంలో చక్కగా సంప్రదాయ దుస్తుల్లో కనిపించి సందడి చేశారు. అయితే అలియా కట్టుకున్న చీర ఇప్పుడూ ఓ సెన్సేషన్‌గా మారింది. నెట్టింట ఈ విషయం గురించే హాట్‌టాపిక్‌గా మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం ఆమె చీరపై రామాయణ ఇతీహసంలోని దృశ్యాలు చిత్రించడమే.

ఇంత ప్రత్యేకతతో కూడిన చీరనా! ఆమె కట్టుకుంది? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు!. పైగా ఆలియా సో గ్రేట్‌ అని పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు అభిమానులు. అంతేగాదు అలియానే ఇన్‌స్ట్రాగ్రామ్‌ వేదికగా తాను ధరించిన ఆ చీర గురించి వివరించింది. అద్దం ముందు దిగిన సెల్ఫీ ఫోటోను జత చేసి మరీ ఆ చీర విశేషాలను పంచుకుంది. 

ఆ చీరపై రామాయణంలోని ముఖ్యమైన దృశ్యాలు  రామసేతు, హనుమాన్‌, రాముడు శివ ధనుస్సును బద్దలు కొట్టడం, రాముడి వనవాసం, గంగానదిపై వంతెన, బంగారు జింక, సీతను అపహరించడం.. తదితర ఘట్టాలను చిత్రీకరించారు. అందుకు దాదాపు 100 గంటలకు పైగా సమయం తీసుకుందని చెప్పుకొచ్చింది. అయితే  ఈ చీర పల్లు మొత్తం చేత్తో డిజైన్‌ చేసింది కావడం విశేషం. ఇక ఆమె ఈ కార్యక్రమంలో భర్త రణబీర్‌ కపూర్‌ తెల్లటి కర్తా పైజామా ధరించి ఒక తెల్లటి శాలువా కప్పుకున్నారు. కాగా, అలియా సంప్రదాయాన్ని గౌరవించేలా ఇలా రామాయణం ఇతివృత్తంతో కూడిన చీరను ధరించడంతో సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

(చదవండి: ప్రాణ ప్రతిష్ట వేళ సెలబ్రెటీలు ఎలాంటి కాస్ట్యూమ్స్‌ ధరించారంటే..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement