కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రజా భాగస్వామ్యంతోనే స్వచ్ఛ ఏలూరు జిల్లా సాధ్యమని, స్వచ్ఛతతోనే ఆరోగ్య సమాజం రూపుదిద్దుకుంటుందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. శుక్రవారం స్థానిక సీఆర్‌రెడ్డి కళాశాలలో స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. జేసీ అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సీహెచ్ శ్రావణ్‌కుమార్‌రెడ్డితో కలిసి కలెక్టర్ అవార్డులు అందజేశారు. పరిశుభ్రత అందరి జీవితాల్లో భాగం కావాలన్నారు. ఏలూరులో వాయు కా లుష్యం తగ్గించి స్వచ్ఛ వాయు సర్వేక్షన్‌లో జాతీయ స్థాయిలో 4వ స్థానం సాధించామన్నారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యం రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 70 మంది వ్యక్తులు, సంస్థలు, స్థానిక సంస్థలకు అవార్డులు అందించారు. డీపీఓ జీవీకే మల్లికార్జునరావు, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఎ.భానుప్రతాప్, డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ, ఐసీడీఎస్ పీడీ శారద, మెప్మా పీడీ రాజబాబు తదితరులు పాల్గొన్నారు.
అవార్డులు వీరికే..
● పురపాలక సంఘం : నూజివీడు మున్సిపాలిటీ
● గ్రామ పంచాయతీలు : పి.అంకంపలెం, వలసపల్లి, చిన నిండ్రకొలను, కొత్తరావిచెర్ల, బుట్టాయగూడెం
● స్వచ్ఛ ఎస్‌ఎల్‌ఎఫ్: వెంకాదేవి, ఇందిరా క్రాంతిపధం, సత్య సమాఖ్య
● గ్రామ సమాఖ్యలు: విజయరాయి (పెదవేగి), కై కరం (ఉంగుటూరు), కొమ్మర (ద్వారకాతిరుమల), నుగొండపల్లి (ఆగిరిపల్లి), జీలుగుమిల్లి
● స్వచ్ఛ పాఠశాలలు: బూరుగువాడ జీపీఎస్, అడవికొలను హైస్కూల్, వెంకటరావుపేట మునిసిపల్ ప్రైమరీ స్కూల్, పంగిడిగూడెం, నాగేశ్వరపురం ఎంపీపీ స్కూళ్లు
● అంగన్‌వాడీ కేంద్రాలు: బుట్టాయగూడెం, తంగెళ్లమూడి సెంటర్, ఎర్రంపేట, తాడువాయి, చిననిండ్రకొలను
● స్వచ్ఛ ఆస్పత్రులు : కై కలూరు, పోలవరం, భీమడోలు సీహెచ్‌సీలు, కొప్పాక, పెదగొన్నూరు, ధర్మాజీగూడెం జీఏడీలు, ఆగిరిపల్లి, నందాపురం, లింగపాలెం పీహెచ్‌సీలు, లంబాడీపేట, కొత్తపేట, నరసింహరావుపేట అర్బన్ పీహెచ్‌సీలు
● ప్రభుత్వ కార్యాలయాలు: ఏలూరు జెడ్పీ కార్యాలయం, కలిదిండి తహసీల్దార్ కార్యాలయం, ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం
● బస్టాండులు: నూజివీడు
● రైతు బజార్లు : ఏలూరు ఏఎంసీ
● సంక్షేమ వసతి గృహాలు : కామవరపుకోట, ఏలూరులోని బీసీ కళాశాల బాలికల వసతి గృహం–2, సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం, చేగొండపల్లిలో గిరిజన బాలుర సంక్షేమ వసతి గృహం
● పరిశ్రమలు : సర్వారాయ షుగర్స్, విన్నర్ సిరామిక్స్, ఎక్సపోన్ పాలిమర్స్, స్టెర్లిన్ బయో రేమిడిఎస్, శ్రీరాజ్యలక్ష్మి పవర్ ఇన్ఫ్రా
● స్వచ్ఛంద సంస్థలు : రవితేజ హెచ్‌ఐవీ ఎఫెక్టెడ్ చిల్డ్రన్ వెల్ఫేర్ సొసైటీ, మేయర్ చిల్డ్రన్స్ హోమ్, సిస్టర్ సెరీనా మెమోరియల్ చిల్డ్రన్ హోమ్
● స్వచ్ఛత వారియర్స్ (పారిశుధ్య కార్మికులు): కె.మోహన్‌రావు, బంగారు లక్ష్మి (ఏలూరు), పి.గోయమ్మ (జంగారెడ్డిగూడెం), ఎం.ఏసు (నూజివీడు), వి.పద్మ (చింతలపూడి)
● స్వచ్ఛత గ్రీన్ అంబాసిడర్ : డి.ఇస్మాయిల్ (భోగోలు), బి.శ్రీనివాస్ (చాటపర్రు), ఎం.దుర్గారావు (గోపవరం), కె.పోలయ్య, జి. ధర్మారావు (రేచర్ల)
● రెసిడెన్షియల్ స్కూల్స్ : వట్లూరు బీఆర్ అంబేడ్కర్ గురుకులం
● స్వచ్ఛత కాలనీ : సాయి బాలాజీ టౌన్‌షిప్
● పర్యాటక ప్రదేశాలు: ఆటపాక పక్షుల కేద్రం
● ఆలయాలు: ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానం
● పార్కులు: ఏలూరు ఆర్‌ఆర్‌పేట మునిసిపల్ పార్క్
● వాణిజ్య విభాగం: ఏలూరులో నవయుగ హోటల్
● స్వచ్ఛ రథం : ముదినేపల్లి మండలం


