బొగ్గుమంటున్న పల్లెలు | - | Sakshi
Sakshi News home page

బొగ్గుమంటున్న పల్లెలు

Oct 6 2026 12:42 AM | Updated on Oct 6 2026 12:42 AM

పశుగ్రాసం పెంపకంలో..

న్యూస్‌రీల్‌

అపార బొగ్గు నిల్వలు

పశుగ్రాసం పెంపకంలో..
రైతులు పశుగ్రాసం పెంపకంలో మెలకువలు పాటించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. సబ్సిడీపై విత్తనాలు అందిస్తున్నామన్నారు. 8లో u

మంగళవారం శ్రీ 6 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

చింతలపూడి: చింతలపూడి నియోజకవర్గంలోని రేచర్ల పరిసర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అండర్‌ గ్రౌండ్‌ కోల్‌ గ్యాసిఫికేషన్‌ (యూసీజీ) ప్రాజెక్టు తీవ్ర వివాదాస్పదంగా మారింది. తమ పచ్చని పంట పొలాలను బొగ్గు గనుల ప్రయోగాలకు బలిపీఠం చేయొద్దంటూ రైతులు నిరసన బాట పట్టారు. అధికారుల ఏకపక్ష వైఖరి, కార్పొరేట్‌ సంస్థల గుట్టుచప్పుడు కాని వ్యవహారాలపై మండలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రసాభాసగా అవగాహన సదస్సు

వెంకటాపురం గ్రామంలో ఈనెల 1న రెవెన్యూ అధికారులు, రిలయన్స్‌ ప్రతినిధులు సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సు తీవ్ర నిరసనల మధ్య రద్దయింది. చట్టబద్ధంగా గ్రామసభ నిర్వహించి తమ అభిప్రాయాలు సేకరించాలని రైతులు పట్టుబట్టగా, అధికారులు అందుకు విరుద్ధంగా ప్రాజెక్టుపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన అన్నదాతలు అధికారులను అడ్డుకున్నారు. ‘మా భూములపై నిర్ణయం తీసుకునే హక్కు మాకుంది’, ‘యూసీజీ గో బ్యాక్‌’ అంటూ పెద్దపెట్టున నినా దాలు చేశారు. దీంతో చేసేది లేక నూజివీడు సబ్‌ కలెక్టర్‌ వినూత్న, తహసీల్దార్‌ దొర, రిలయన్స్‌ ప్రతినిధులు వెనుదిరిగారు.

పర్యావరణ ప్రభావంపై దాగుడుమూతలు

గ్రామసభలో 80 శాతం మంది ప్రజల ఆమోదం ఉంటేనే ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని, లేకుంటే రద్దు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే ఇక గ్రామసభలతో నిమిత్తం ఉండదంటూ అధికారులు దాటవేత ధోరణి ప్రదర్శించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంతవరకు ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను ఎందుకు బహిర్గతం చేయలేదని రైతులు నిలదీస్తున్నారు. భూసేకరణ పరిధి 8,500 ఎకరాలే అని సంస్థ చెబుతున్నా భూగర్భంలో బొగ్గును అధిక ఉష్ణోగ్రతల వద్ద మండించడం వల్ల వెలువడే తీవ్ర వేడి, రసాయనాలు పరిసరాల్లోని వేలాది ఎకరాల సారవంతమైన నేలను నిస్సారంగా మారుస్తాయని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూగర్భ జలాలు విషతుల్యమై గ్రామాలు ఖాళీ చేయాల్సి వస్తుందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇలాంటి ప్రాజెక్టు వల్ల తీవ్ర నష్టాలు వాటిల్లిన దాఖలాలు ఉండటంతో ఇక్కడ అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు.

కార్పొరేట్‌ ఒత్తిళ్లు.. న్యాయపోరాటానికి సన్నద్ధం

గత మే నెలలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర కేబినెట్‌ ఏకంగా రూ.37,500 కోట్ల సబ్సిడీకి ఆమోదం తెలపడంతో, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలనే పట్టుదలతో పాలకులు ఉన్నట్టు తెలుస్తోంది. అటు కేంద్ర, రాష్ట్ర పాలకుల నుంచి రైతులకు మద్దతు కరువవడంతో పాలకులు తమ గోడు వినకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకోవడమే శరణ్యమని రైతులు నిర్ణయించుకున్నారు.

నేలతల్లిపై నిప్పుల కుంపటి

రిలయన్స్‌ యూసీజీ ప్రాజెక్టుపై ఆగ్రహం

గ్రామసభ లేకుండా ముందుకెళ్లేది లేదని తెగేసి చెప్పిన రైతులు

న్యాయపోరాటానికి సిద్ధం

చింతలపూడి బ్లాక్‌లో 1,200 హెక్టార్ల విస్తీర్ణంలో 904.94 మిలియన్‌ టన్నుల ఎ–12 రకం బొగ్గు ఉన్నట్టు గుర్తించారు. రేచర్ల బ్లాక్‌లో 2,225 హెక్టార్ల విస్తీర్ణంలో 2,225.67 మిలియన్‌ టన్నుల ఎ–13 రకం బొగ్గు నిల్వలు ఉన్నాయి. మొత్తం రెండు బ్లాకుల్లో కలిపి ఏకంగా 3,130.61 మిలియన్‌ టన్ను ల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. వీటిని రిలయన్స్‌ సంస్థకు కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement