టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధం కండి | - | Sakshi
Sakshi News home page

టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధం కండి

Oct 6 2026 12:42 AM | Updated on Oct 6 2026 12:42 AM

టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధం కండి సహజ రంగులు మేలు 11 నుంచి స్పెషల్‌ టెట్‌ వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): త్వరలో జరుగనున్న ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికలకు వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ నాయకులు సిద్ధంగా ఉండాలని టీచర్స్‌ ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి పిలుపునిచ్చారు. విజయవాడ సీఎస్‌ఆర్‌ రెసిడెన్సిలో జరిగిన ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల వైఎస్సార్‌ టీచర్స్‌ యూనియన్‌ నాయకులతో వైఎస్సార్‌ టీఏ అధ్యక్షుడు కె.జాల్‌ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ అర్హత గల ఉపాధ్యాయులను ఓటర్లుగా న మోదు చేయించడానికి వైఎస్సార్‌టీఏ నాయకులు చొరవ చూపాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్‌ జంషెడ్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం సుధీర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాకర శ్యామ్‌, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మొరాల సుధాకర్‌, యార్లపాటి రమేష్‌ బాబు, వైఎస్సార్‌టీఏ గౌరవ అధ్యక్షుడు ఎస్‌వీ జాకబాబు తదితరులు పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం(చింతలపూడి): స్థానిక ఛత్రపతి శివాజీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ప్రిన్సిపాల్‌ ఎన్‌.ప్రసాద్‌బాబు అధ్యక్షతన అర్థశాస్త్ర, వాణిజ్య శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో ‘కలరింగ్‌ లైవ్లీహుడ్స్‌’ (జీవనోపాధికి రంగులు అద్దటం) అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఉన్నత విద్యామండలి ఆర్‌జేడీ పీవీ కృష్ణాజీ మాట్లాడుతూ సహజ రంగుల వినియోగం, స్థానిక వనరులను ప్రోత్సహించడం ద్వారా దేశ స్వయం సమృద్ధికి మార్గం సుగమమవుతుందన్నారు. ఐఐటీ తిరుపతి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా. సంయుక్త భూపతిరాజు మాట్లాడుతూ రసాయనిక రంగుల వాడకం తగ్గించి పర్యావరణహిత ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వాలన్నారు. సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ పీఏ నాయుడు, టిస్‌ సీఈఓ సుజయ్‌ దీక్షిత్‌, కన్వీనర్‌ బి.శ్రీనివాసరావు, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్‌ మర్రి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయులకు స్పెషల్‌ టెట్‌ పరీక్షలు ఈనెల 11 నుంచి ప్రారంభమవుతాయని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. ఏలూరులోని సిద్ధార్థ క్వెస్‌ స్కూల్‌, సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌లో పరీక్షలు జరుగుతాయన్నారు. సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌లో 11న ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో 400 మంది హాజరుకానున్నారన్నారు. సిద్ధార్థ క్వెస్ట్‌ స్కూల్‌లో ఈనెల 15 వరకు రెండు సెషన్లలో 1,700 మంది హాజరవుతారన్నారు. ఉద యం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయన్నారు.

మండవల్లి: మానవులు, జంతువుల సహజీవనంలో వన్యప్రాణుల సంరక్షణ కీలకమని అటవీ శాఖ కై కలూరు రేంజర్‌ కె.రామలింగాచార్యులు అన్నారు. వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా సోమవారం దేవీ చింతపాడులో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ముందుగా గ్రామంలో వన్యప్రాణులను కాపాడుకుందాం – ప్రకృతిని పరిరక్షిద్దాం అనే నినాదాలతో ర్యాలీ చేపట్టారు. రేంజర్‌ మాట్లాడుతూ భారతదేశంలో వన్యప్రాణుల సంరక్షణ ప్రముఖ్యతను గుర్తించి, వాటి రక్షణ కోసం చట్టాలను తీసుకురావడానికి 1952లో మొదటిసారిగా ఇండియన్‌ బోర్డ్‌ ఫర్‌ వైల్డ్‌లైఫ్‌ వారోత్సవాలను ప్రారంభించిందన్నారు. అంతరించి పోతున్న జంతు జాతులు, పక్షుల రక్షణ అందరి బాధ్యతగా భావించాలని కోరారు. డెప్యూటీ రేంజర్‌ శేఖర్‌బాబు, మండవల్లి సెక్షన్‌ ఆఫీసర్‌ రాంబాబు, ఫారెస్టు బీట్‌ ఆఫీసర్లు, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement