కలెక్టర్ నాగరాణి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా అందిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపడానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జిల్లాస్థాయి పీజీఆర్‌ఎస్‌లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. క్షేత్రస్థాయిలో అర్జీదారులు ఎదుర్కొంటున్న అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జేసీ ఎంజే అభిషేక్‌గౌడ, ఇన్‌చార్జి డీఆర్వో, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.ముక్కంటి, విజిలెన్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎల్.దేవకీదేవి పాల్గొన్నారు.
అర్జీల్లో కొన్ని..
కామవరపుకోట మండలం సాగిపాడుకి చెందిన గోగు చినమంగమ్మ 170/1 సర్వే నంబర్‌లోని 80 సెంట్ల భూమిని హద్దులు నిర్ణయించి అప్పగించాలని కోరారు.
పెదవేగి మండలం చక్రాయగూడేనికి చెందిన గారపాటి కనకదుర్గ సునీత తమ భూమి సర్వే చేసి పట్టాదారు పాసు పుస్తకం ఇప్పించాలని అర్జీ సమర్పించారు.
ముదినేపల్లి మండలం పెయ్యేరుకి చెందిన కొట్టి బేబీషాలిని తన సోదరుడు కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందాడని, అయితే తనను, తల్లిని చూడటం లేదని, తల్లి చనిపోయినా పట్టించుకోలేదని న్యాయం చేయాలని కోరారు.
జంగారెడ్డిగూడెం మండలం కేతవరానికి చెందిన వామశెట్టి మణెమ్మ పక్కా ఇంటి కోసం అర్జీ అందజేశారు.
చింతలపూడి మండలం రేచర్లకి చెందిన నండ్రు మధుసూదనరావు ఇంటి నిర్మాణం పూర్తిచేసి చేసి నాలుగేళ్లు అయినా బిల్లులు రాలేదని, మంజూరు చేయాలని కోరారు.


