అక్రమ కేసులపై గర్జించిన గిరిజనులు | - | Sakshi
Sakshi News home page

అక్రమ కేసులపై గర్జించిన గిరిజనులు

Oct 6 2026 12:42 AM | Updated on Oct 6 2026 12:42 AM

ఏలూరు (టూటౌన్‌): ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు, గిరిజన నాయకులపై బనాయించిన అక్రమ కేసులు, తెల్లం రామకృష్ణ, అందుగుల ఫ్రాన్సిస్‌, తెల్లం దుర్గారావులపై పెట్టిన అక్రమ రౌడీషీట్లు తక్షణమే ఎత్తివేయాలని, 1/70 చట్టం, ఎల్‌టిఆర్‌. చట్టాలను అమలు చేయాలని, సాగులో ఉన్న గిరిజనులను రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కించాలని, సాగు పట్టాలు ఇవ్వాలని, ఏజెన్సీ భూ సమస్యల్లో పోలీసుల జోక్యాన్ని నివారించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, బి.బలరాం డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద ఏజెన్సీ మండలాల నుంచి వందలాది మందితో మహాధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కె.శ్రీనివాస్‌ అధ్యక్షత వహించారు. గిరిజన చట్టాలను సక్రమంగా అమలు చేయండి అని అడిగినందుకు దుర్మార్గపూరితంగా అక్రమ కేసులు పెట్టి, రౌడీషీటర్లుగా ముద్రవేసి జైళ్లకు పంపుతున్నారని అక్రోశం వ్యక్తం చేశారు. ప్రజావ్యతిరేక విధానాలు మానుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజ లే ఈ ప్రభుత్వాన్నికి గట్టి బుద్ధి చెబుతామన్నారు. అనంతరం కలెక్టర్‌ వెట్రిసెల్వికి వినతిపత్రం అందించగా.. త్వరలో తహసీల్దార్‌ సమక్షంలో రెవెన్యూ అధికారులతో కలిసి సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు.జిల్లా కార్యదర్శి ఆర్‌.లింగరాజు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ, డీఎన్‌వీడీ ప్రసాద్‌, మొడియం నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement