పోలవరం జల విద్యుత్‌లో ముందడుగు | - | Sakshi
Sakshi News home page

పోలవరం జల విద్యుత్‌లో ముందడుగు

Oct 6 2026 12:42 AM | Updated on Oct 6 2026 12:42 AM

పోలవరం జల విద్యుత్‌లో ముందడుగు

పోలవరం రూరల్‌: పోలవరం జల విద్యుత్‌ కేంద్రం నిర్మాణ పనుల్లో ముందడుగు పడింది. ప్రాజెక్టు పరిధిలోని తొలి యూనిట్‌లో కీలకమైన స్టాటర్‌ ఏర్పా టు ప్రక్రియను ఏపీ జెన్‌కో, నిర్మాణ సంస్థ ఇంజ నీరింగ్‌ బృందాలు సోమవారం లాంఛనంగా ప్రా రంభించాయి. దీంతోపాటు రోటర్‌ బిగింపు పనులకు కూడా శ్రీకారం చుట్టారు. ఏపీ జెన్‌కో (హైడల్‌) విభాగం డైరెక్టర్‌ సుజయ్‌కుమార్‌, నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ సతీష్‌బాబు అంగర, ఎంఈఐఎల్‌ జనరల్‌ మేనేజర్‌ ప్రసేన్‌జిత్‌ మజుందార్‌, ఏపీ జెన్‌కో సీఈలు రవీంద్రరెడ్డి, విశ్వేశ్వరరావు తదితరులు క్షేత్రస్థాయిలో పాల్గొని నిర్మాణ పురోగతిని, పరికరాల అమరిక నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. పోలవరం జల విద్యుత్‌ కేంద్రంలో మొత్తం 12 యూనిట్లను నిర్మిస్తున్నారు. ప్రతి యూనిట్‌ ద్వారా 80 మెగావాట్ల చొప్పున మొత్తం 960 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలనేది ప్రణాళిక అని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement