● యథేచ్ఛగా తవ్వకాలు
● ట్రాక్టర్లలో అక్రమ రవాణా
కొయ్యలగూడెం : మండలంలోని దిప్పకాయలపాడు రాజుచెరువు నుంచి ఆదివారం యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా కొనసాగింది. దిప్పకాయలపాడు గ్రామానికి చెందిన రెండు పొక్లయిన్లను ఏర్పాటు చేసి అక్రమార్కులు ట్రాక్టర్లు, ట్రక్కుల్లో మట్టిని తవ్వి తరలించారు. దీనిపై ఇరిగేషన్ ఏఈ రాహుల్ భాస్కర్ కు ఫిర్యాదు వెళ్లగా ఆయన సిబ్బందిని పంపి ఒక పొక్లయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సెలవు రోజుల్లో అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడం చెరువుల్లో అక్రమంగా మట్టి తోలకాలకు అనువుగా ఉందని ఆయకట్టు రైతులు అంటున్నారు. అలాగే కన్నాపురం జెడ్పీ హైస్కూల్ వెనుక ఉన్న చెరువు నుంచి కూడా పొక్లయిన్లతో తవ్వి టిప్పర్లలో మట్టిని తరలించాలని ఆరోపించారు.


