జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్
కై కలూరు: వైఎస్సార్‌సీపీ కై కలూరు కార్యాలయంలో మంగళవారం సా యంత్రం 4 గంటలకు నియోజకవర్గ నాలుగు మండలాల నాయ కులు, కార్యకర్తలకు స మావేశం నిర్వహిస్తున్నామని జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) సోమవారం తెలిపారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 5న పొగాకు రైతుల కోసం చలో దేవరపల్లి, అలాగే 2005లో డీఎస్సీలో జరిగిన అక్రమాల ఆంశాలపై సమావేశంలో చర్చిస్తామన్నారు. ఈనెల 6 నుంచి 9 వరకు రిలే దీక్షలు జరుగుతాయని, ఆయా కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.
ఏలూరు (టూటౌన్): ఏలూరు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో 295 అర్జీలు స్వీకరించినట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టర్‌తో పాటు జేసీ ఎంజే అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సీహెచ్ శ్రావణ్‌కుమార్, డీఆర్వో ఎం. శ్రీదేవి, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వి నూత్న తదితరులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు పునరావృతం కాకుండా లబ్ధిదారులు సంతృప్తిని దృష్టిలో ఉంచుకుని, నా ణ్యమైన పరిష్కారం అందించాల్సిన బాధ్యత అధికారులుపై ఉందన్నారు.
కలిదిండి(కై కలూరు): ముఖ్యమంత్రి చంద్రబాబు మీ భూమి–మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాల పంపిణీ నిమిత్తం ఈనెల 10న కై కలూరు నియోజకవర్గం కలిదిండి రానున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటుచేస్తున్నారు. సీఎం పర్యటన ఖరారు కావడంతో సోమవారం కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్, జేసీ అభిషేక్ గౌడ్, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న కలిదిండి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణాన్ని అక్కడి నుంచి సమీపంలో హెలీప్యాడ్, మరో మూడు ప్రాంతాలను పరిశీలించారు. అధికారులంతా అప్ర మత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. కలిదిండి, మండవల్లి ఎస్సై పవన్‌కుమార్, రామచంద్రరావు ఉన్నారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి హుండీల ఆదాయాన్ని సోమవారం దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, ఎంఎస్‌ఎన్ చారిటీస్ (కాకినాడ) ఈఓ సీహెచ్ సురేష్‌నాయుడు పర్యవేక్షణలో లె క్కించారు. గత 25 రోజులకు నగదు రూపంలో 2,81,82,065లు, 242 గ్రాముల బంగారం, 3.330 కిలోల వెండితో పాటు విదేశీ కరెన్సీ లభించినట్టు ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే లెక్కింపులోకి రాని రద్దయిన రూ.2,000, రూ.500 నోట్ల ద్వారా రూ.22 వేలు లభించిందన్నారు. సగటున రోజుకు రూ.11,27,283 ఆదాయం లభించిందన్నారు. శ్రీవారి దేవస్థానం అధికారులు, సిబ్బంది, సేవాదళం సభ్యులు పాల్గొన్నారు.
ఏలూరు (టూటౌన్): రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన మంగళవారం ఏలూరు కలెక్టరేట్‌లో జిల్లా సమీక్షా సమావేశం (డీఆర్సీ) నిర్వహించనున్నట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. సమావేశంలో జిల్లాలో ఎల్‌నినో, వర్షపాతం పరిస్థితులు, భూగర్భ జలాల స్థితి, 22ఏ, దేవదాయ శాఖ అంశాలు, వరదల పరిస్థితి తదితర అంశాలపై సమీక్షిస్తారని కలెక్టర్ అన్నారు.


