యూత్ ఐకాన్ అవార్డు
తాడేపల్లిగూడెం: సామాజిక సేవ, యువజన సాధికారత కృషి చేస్తున్న తాడేపల్లిగూడెంకు చెందిన చిరివెళ్ల సాయి మహంతీర్‌కు యూత్ ఐకాన్ అవార్డు లభించింది.
ఉంగుటూరు: నల్లమాడు జంట హత్యల కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఏలూరు జిల్లా నల్లమాడు ఆయకట్టు జీడితోట పొలంలో జరిగిన తల్లి, కూతుళ్ల హత్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ ఘటన జరిగి 37 గంటలు గడుస్తున్నా పోలీసులకు ఇంకా ఎలాంటి కీలక ఆధారాలు దొరకలేదు. ఏలూరు, జంగారెడ్డిగూడెం ట్రైనీ ఐపీఎస్ అధికారులు, డీఎస్పీ శ్రావణ్‌కుమార్ నేతృత్వంలోని బృందాలు మంగళవారం మరోసారి అక్కడ తనిఖీలు చేపట్టాయి. నిందితుల కోసం వేలిముద్రల నిపుణులు, క్లూస్ టీమ్ సలహాలు తీసుకుంటూ, సెల్‌ఫోన్ డేటా ఆధారంగా కూడా విచారణ జరుపుతున్నారు. కేసును ఛేదించేందుకు పలువురు సీఐలు, ఎస్‌ఐలు రంగంలోకి దిగారు. మరోవైపు గణపవరం సీఐ రజనీకుమార్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో మృతులు ఆంధోబాయి, ఆమె కుమార్తె వెంకటలక్ష్మి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం మృతదేహాలను కుమారుడు నాగరాజు, భర్త సుదర్శన్‌లకు అప్పగించగా, బంధువులు అనంతపల్లిలో అంత్యక్రియలు పూర్తి చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.


