చాట్రాయి/లింగపాలెం: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని మర్లపాలెం గ్రామానికి చెందిన పర్వతనేని కిషోర్ (45) సోమవారం లింగపాలెం మండలం జూబ్లి నగర్ పని మీద వెళ్లాడు. తన ద్విచక్రవాహనంపై ఎదురుగా వస్తున్న వాహనం తప్పించబోయి రోడ్డుపై పడడంతో తలకి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న ధర్మాజిగూడెం ఎస్సై కె వెంకన్న ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. కాగా మృతుడి కొడుకు కూడా ఇటీవలే మృతి చెందాడు.


