దాహార్తి తీర్చడానికి ఏలూరు నగరంలో ప్రధాన కూడళ్లల్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాలు చాలాచోట్ల నీళ్లు లేవు. కొన్ని చోట్లయితే మధ్యాహ్నానికే నీరు అయిపోతున్నా మళ్ళీ ఏర్పాటు చేయడం లేదు. రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు పోటాపోటీగా ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం మంచిపని అయినా దాన్ని పూర్తిగా సఫలం చేయడంలో మాత్రం విఫలమవుతనారు. ఏలూరు నగరంలో నీరులేక ఒకచోట అయితే.. మజ్జిగ లేక మరొక చోట ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు
ఏలూరు (టూటౌన్): జిల్లా ఉపాధి కార్యాలయం, నేషనల్ కెరీర్ సర్వీస్–ఏలూరులో జాబ్ డ్రైవ్ ను ఈ నెల 14న ఉదయం 10 గంటలకు, ఉపాధి కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఉపాధి అధికారి పి.వి.రమేష్ కుమార్ తెలిపారు. బజాజ్ క్యాపిటల్, భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ లిమిటెడ్ కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. ఎస్‌ఎస్‌సి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న పురుషులు, మహిళలు పాల్గొనవచ్చునన్నారు. జీతం నెలకు రూ. 14000 నుంచి 20,000 ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 88868 82032 నెంబరులో సంప్రదించాలన్నారు.


