ఉండి మండలం ఉణుదుర్రులో ఇళ్ల కోసం బాధితులు పోరాటం సాగిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి తమ నిరసన తెలిపారు. 8లో u
నాణ్యమైన పరిష్కారం చూపాలి
ఏలూరు (టూటౌన్): జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా స్థాయి అధికారులతో కలెక్టరు కె.వెట్రిసెల్వి నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ, ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి ఎల్.దేవకీదేవి, ఇన్‌చార్జి ఆర్డీవో ఐ.కిషోరు, స్పెషల్ డిప్యూటీ కలెక్టరు కె.భాస్కర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి యం.ముక్కంటిలు ప్రజలు నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ ద్వారా అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలని అన్నారు. అర్జీదారులు కార్యాలయాలు చుట్టూ తిరగకుండా నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారంపై లబ్ధిదారులు సంతృప్తి స్థాయి పెరిగేలా పరిష్కారం ఉండాలని అన్నారు. ఫిర్యాదు పరిష్కారం సాధ్యం కాకపోతే కారణాన్ని అర్థమయ్యే విధంగా ఎండార్స్‌మెంట్ ఇవ్వాలన్నారు. మొత్తం 273అర్జీలు స్వీకరించారు.
ఏలూరు (టూటౌన్): సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శిగా ఆర్.లింగరాజు ఎన్నికయ్యారు. ఇంతవరకు జిల్లా కార్యదర్శిగా పనిచేసిన ఎ.రవి కుటుంబ, వ్యక్తిగత కారణాలతో పశ్చిమగోదావరి జిల్లాలో చేసేందుకు తనను రిలీవ్ చేయాలని కోరారన్నారు. ఆయన కోరిక మేరకు జిల్లా కమిటీ సమావేశం రాష్ట్ర నాయకుల సమక్షంలో చర్చించి ఆయన్ను రిలీవ్ చేసిన నేపధ్యంలో నూతన కార్యదర్శి ఎన్నిక జరిగిందని ప్రకటించారు.


