● 23 నెలల్లో రూ.3.62 లక్షల కోట్ల అప్పు
● మాజీ ఎమ్మెల్యే వెంకట ప్రతాప్ అప్పారావు ధ్వజం
నూజివీడు : రాజధాని పేరుతో ప్రభుత్వం అంతు లేని దోపిడీ చేస్తోందని, ఎన్ని లక్షల కోట్లు పెడితే రాజధాని అభివృద్ధి చెందుతుందో పాలకులకు స్పష్టత లేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నూజివీడు నియోజకవర్గ ఇన్‌చార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ నూజివీడు నియోజకవర్గ అధ్యక్షుడిగా కొమ్ము వెంకటేశ్వరరావును నియమించిన నేపథ్యంలో నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమ్మేళనాన్ని స్థానిక వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కార్యాలయ ఆవరణలో శనివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా మేకా ప్రతాప్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 23 నెలల్లో రూ.3.62 లక్షల కోట్లు అప్పులు చేసిందని, ఆ సొమ్మంతా ఏం చేసిందో రాష్ట్ర ప్రజలకు చె ప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తానంటూ బీరాలు పలికారని, అప్పులు చేయడమే సంపద సృష్టా అని ప్రతాప్ నిలదీశారు. ఏ పనులూ జరగడం లేదని, ఎమ్మెల్యే, మంత్రులు దోపిడీనే శ్వాసగా చేసుకొని దండుకొంటున్నారని టీడీపీ నాయకులే ధ్వజమెత్తుతున్నారన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే 100 మంది ఎస్సీ నాయకులకు వివిధ విభాగాల్లో పార్టీ పదవులు ఇచ్చామని, ఇంత పెద్ద ఎత్తున ఏ రాజకీయ పార్టీలోనూ ఎస్సీలకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. కార్యకర్తలు, నాయకులు వైఎస్ జగన్ ను 2029లో ముఖ్యమంత్రిని చేసుకునే వరకు విశ్రమించకూడదన్నారు.
స్థానిక సంస్థల్లో సత్తాచాటాలి
రానున్న పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయదుందుభి మోగించేలా పార్టీ శ్రేణు లు పనిచేయాలని ప్రతాప్ అప్పారావు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, భూ దోపిడీ, అమలు కాని సంక్షేమ పథకాలు, మట్టి మాఫియాపై ఇంటింటా ప్రచారం చేయాలన్నారు. టీడీపీ కార్యకర్తలను టీడీపీలోనే చేర్చుకుని వైఎస్సార్‌సీపీ నుంచి చేరినట్లు ప్రచారం చేసుకోవడం వారి పతనానికి నాంది అని అన్నారు.
మామిడి, మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి
మామిడికి, మొక్కజొన్నకు ధర లేక రైతులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభు త్వం వెంటనే ఆదుకోవాలని ప్రతాప్ అప్పారావు డిమాండ్ చేశారు. గతేడాది మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ ఏడాది మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. త్వరలోనే మామిడి రైతులతో సదస్సును ఏర్పాటు చేసి వారి సమస్యలపై చర్చించి కార్యాచరణ రూ పొందిస్తామన్నారు. అనంతరం ఎస్సీ నాయకులు ఆయన్ను సన్మానించారు. వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు శీలం రాము, జెడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, ముసునూరు జెడ్పీటీసీ వరికూ టి ప్రతాప్, ఎస్సీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు కొమ్ము వెంకటేశ్వరరావు, క్రిస్టియన్ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు పిళ్లా చరణ్, జిల్లా అధికార ప్రతినిధి కంచర్ల లవకుమార్, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంభాల రాంబాబు, నాయకులు ముల్లంగి జమలయ్య, ఉదయగిరి కృపారావు, కాలి సుగుణరావు, లాం ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.


