సాక్షి టాస్క్‌ఫోర్స్ : జిల్లాలోని ఆక్వా చెరువులు పేకా ట శిబిరాలకు అడ్డాగా మారుతున్నాయి. నిర్వాహకులు చెరువు గట్లపై యథేచ్ఛగా పేకాట నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండుగ నుంచి కొల్లేరు ప్రాంతాల్లో పేకాట ఆగింది లేదనేది ప్రజల్లో నానుడి. చెరువులు నిర్మానుష్య ప్రాంతాల్లో ఉండటం, మేత ల నిమిత్తం షెడ్ల ఏర్పాటు జూదరులకు అనుకూలంగా మారింది. దీంతో రాత్రిళ్లు పేకాట యథేచ్ఛగా సాగుతోంది.
ఉమ్మడి జిల్లాలో ఆక్వా సాగు 2.90 లక్షల ఎకరాల్లో ఉండగా కై కలూరు నియోజకవర్గంలో 84,852 ఎకరాల్లో చేపలు, రొయ్యల సాగు చేస్తున్నారు. చేపల చెరువు గట్లు పేకాట శిబిరాలకు నిలయాలుగా మారుతున్నాయి. జూద నిర్వాహకులు గంట ముందు సెల్‌ఫోన్లలో మెసేజ్ పెడుతున్నారు. డొంక రోడ్లలో ద్విచక్రవాహనాలతో జూదరులు ఆయా ప్రాంతాలకు చేరుతున్నారు. రాత్రి నుంచి వేకువజాము వరకూ పేకాట సాగుతోంది.
సరిహద్దుల్లో పేకాట సామ్రాజ్యం
కూటమి ప్రభుత్వం రాగానే జూద నిర్వాహకులు కొత్త ఎత్తుగడ వేశారు. జిల్లాల సరిహద్దుల్లో శిబిరా లు నిర్వహిస్తే ఎవరూ రారనే ధీమా వీరిది. కై కలూరు మండలం ఉప్పుటేరు, పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు సరిహద్దు, మదినేపల్లి మండలం చేవూరుపాలెం–పెడన సరిహద్దుల్లో పేకాట ఆడుతున్నారు. ఇక కై కలూరు మండలం కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద ఆదివారం పేకాట జాతర జరిగింది. కొట్టాడలో ఓ నాయకుడి ఇంటి వద్ద నిత్య కల్యాణం మాదిరిగా పేకాట నిర్వహిస్తున్నారు. ఏడేళ్లగా పాతుకుపోయిన ఈ ప్రాంతానికి చెందిన పోలీ సు శాఖ చిరుద్యోగి జూదరులకు సమాచారం అందిస్తున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండవల్లి మండలం భైరవపట్నం, రుద్రవరం–చిగురుకోట రోడ్డు, నుచ్చుమిల్లి–పోల్‌రాజ్ డ్రెయిన్ వద్ద, ఉనికిలి, కలిదిండి మండలంలో కోరుకొల్లు, కొండూరు, మట్టగుంట, పెదలంక, పెదతాడినాడ, ముదినేపల్లి మండలంలో పెదపాలపర్రు, సింగరాయపాలెం, బొమ్మినంపాడు, వైవాక గ్రామాల్లో పేకాట శిబిరాలు ఉన్నట్టు సమాచారం.
జాన్‌పేట సమీప చెరువు గట్లపై పేకాట ఆడుతున్నారన్న విషయం తమకు తెలియదు. ఇప్పుడే సిబ్బందితో వెళ్లి దాడులు చేస్తాను. పేకాట, కోడిపందేలు వంటివి ఎక్కడ జరిగినా నిర్వాహకులపై పోలీసు చర్యలు తప్పవు. వీటిని పూర్తిస్థాయిలో అరికట్టడానికి సిబ్బందితో గస్తీ నిర్వహిస్తాం.
–డి.వెంకట్‌కుమార్, టౌన్ ఎస్సై, కై కలూరు
పక్షుల కేంద్రం సమీపంలో పేకాటనే ఇంటి పేరుగా మార్చుకున్న ఓ నిర్వాహకుడు కై కలూరు టౌన్ స్టేషన్‌ను అత్తారిల్లుగా భావిస్తున్నాడు. సేవా కార్యక్రమాల పేరుతో పోలీస్‌స్టేషన్‌లో ఏ కార్యక్రమం చేసినా సాయం చేస్తానని ముందుకొస్తాడు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకుడి ఫ్లెక్సీ పెట్టేస్తాడు. ఏకంగా పోలీసులతో కలిసి ప్రారంభోత్సవాల్లో పాల్గొంటాడు. అతడి ఆధ్వర్యంలో జాన్‌పేట సమీపంలో చెరువు గట్లపై పేకాట, పండుగ సమయాల్లో కోడిపందేలు జరుగుతున్నాయి. ఇటీవల అతడికి మరో నిర్వాహకుడు జత కలిశాడు. కలిదిండి రైల్వేగేటు దాటిన తర్వాత కర్మాగారం నడుపుతున్న వ్యక్తి, నిత్యావసర వస్తువులను పంపిణీ చేసే మరో వ్యక్తి రాత్రి అయితే చాలు ఒకే బైక్‌పై పేకాటకు వెళుతున్నారు.
ఆక్వా చెరువులపై అర్ధరాత్రి కాయ్ రాజా కాయ్
ఆటపాకలో పేకాట పితామహుడిది ఇష్టారాజ్యం
కొల్లేటిలంక గ్రామాల్లో విచ్చలవిడిగా పేకాట


