అంజనీపుత్ర.. పవనసుత నామ | - | Sakshi
Sakshi News home page

అంజనీపుత్ర.. పవనసుత నామ

May 11 2026 8:38 AM | Updated on May 11 2026 8:38 AM

అంజనీపుత్ర.. పవనసుత నామ ఆర్థిక సంస్కరణల పేరుతో ప్రజలపై భారాలు లేబర్‌ కోడ్లు రద్దు చేయాలి

జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమద్‌ జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నిత్య కై ంకర్యాలు, పంచామృతాభిషేకాలు చేశారు. అనంతరం భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కల్పించారు. సాయంత్రం ధ్వజారోహణ నిర్వహించినట్టు ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌, ఈఓ ఆర్‌వీ చందన తెలిపారు. సోమవారం లక్ష తమలపాకులతో లక్షార్చన నిర్వహిస్తామన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం డబుల్‌ బుల్డోజర్‌ సర్కార్‌గా మారి ప్రజలపై భారాలు వేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు. దీనిపై జూన్‌, జూలై నెలల్లో ప్రజాపోరుకు సిద్ధమయ్యామన్నారు. స్థానిక ఉద్దరాజు రామం భవనంలో సీపీఎం జిల్లాస్థాయి విస్తృత సమావేశం ఆదివారం జిల్లా కార్యదర్శివర్గ స భ్యురాలు మొడియం నాగమణి అధ్యక్షతన ని ర్వహించారు. ముఖ్య అతిథిగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణల పేరుతో ప్రజలపై భారాలు వేస్తున్నారని, నాలుగు లేబర్‌ కోడ్లను తీసుకువచ్చి కార్మికులను బానిసలుగా మారుస్తున్నారన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేశారన్నారు. సర్‌ అనే పేరుతో ప్రజల ఓటు హక్కును సైతం భ్రష్టుపట్టించారన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, వీహెచ్‌పీ వంటి సంస్థలు ఆకివీడు, కడపలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు, బి.బలరాం మాట్లాడుతూ ఆక్వా రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని, మొక్కజొన్న రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆందో ళన వ్యక్తం చేశారు. జిల్లా నాయకులు ఆర్‌.లింగరాజు, ఎ.రవి, డీఎన్‌వీడీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

భీమవరం: కేంద్ర ప్రభుత్వం విజయ గర్వంతో కార్మికులపై దాడిని ప్రారంభించిందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.రాజారామ్మోహన్‌రాయ్‌ ధ్వజమెత్తారు. భీమవరంలో లేబర్‌ కోడ్స్‌ను రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం సీఐటీయూ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. లేబర్‌ కోడ్స్‌ అమలు కోసం రూల్స్‌ను రూపొందించి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో అమలు కోసం నోటిఫికేషన్‌ విడుదల చేయడం దారుణమన్నారు. లేబర్‌ కోడ్స్‌ కారణంగా శ్రామికవర్గం తీవ్రంగా నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement