పరిమళించిన మానవత్వం | - | Sakshi
Sakshi News home page

పరిమళించిన మానవత్వం

May 11 2026 8:38 AM | Updated on May 11 2026 8:38 AM

పరిమళించిన మానవత్వం నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్‌

కొయ్యలగూడెం : ఆపదలో ఉన్న బాలుడి ప్రాణాలను నిలబెట్టడానికి గ్రామ యు వత నడుం బిగించింది. ఇంటింటా విరాళాల సేకరణకు శ్రీకారం చుట్టింది. ‘సాక్షి’లో ఆదివారం ప్రచురించిన ‘సాయం కోసం ఎదురుచూపులు’ కథనానికి స్పందించడంతో పాటు సోషల్‌ మీడియా మాధ్యమాల ద్వారా బయ్యనగూడెంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న సింగంశెట్టి నాగమణికంఠ పరిస్థితి తెలుసుకున్న యువకులు తొలిరోజు రూ.1.50 లక్షలు విరాళాలు సేకరించి అందజేశారు. బాలుడి వైద్యానికి రూ.22 లక్షల వరకు ఖర్చవుతుందని, ఇకపై రోజూ సమీప గ్రామాల్లో తిరుగుతూ విరాళాలు సేకరిస్తామని యువకులు తెలిపారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఏలూరు కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి యథావిధిగా పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి తెలిపారు. ఫిర్యాదు నమోదు, స్థితి తదితర సమాచారం కోసం 1100 టో ల్‌ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేయవచ్చన్నారు. అలాగే మండల, డివిజినల్‌, మున్సిపల్‌ స్థాయిల్లోనే పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం నిర్వహిస్తారని, ప్రజలు సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement