ఈపీఎఫ్‌ పెన్షన్‌ పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ఈపీఎఫ్‌ పెన్షన్‌ పెంచాలి

May 10 2026 7:58 AM | Updated on May 10 2026 7:58 AM

ఈపీఎఫ్‌ పెన్షన్‌ పెంచాలి 30న విశ్రాంత ఉద్యోగుల సంఘ ఎన్నికలు పీజీ సెట్‌కు 308 మంది హాజరు కక్ష సాధింపులతోనే అక్రమ కేసు అభయాంజనేయా నమోస్తుతే

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఈపీఎఫ్‌ పెన్షన్‌ రూ. 7,500కు పెంచాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు ప్రగతిశీల ఈపీఎఫ్‌ పెన్షనర్ల సంఘం ఏలూరు కమి టీ తెలిపింది. స్థానిక ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో ధర్నా పోస్టర్‌ను శనివారం ఆవిష్కరించారు. ఐఎఫ్‌టీయూ నగర అధ్యక్షుడు బి. సో మయ్య మాట్లాడుతూ 30 ఏళ్లుగా ఈపీఎఫ్‌ పెన్షన్‌ పెంచలేదన్నారు. పార్లమెంటరీ కమిటీ పెన్షన్‌ రూ.7,500 పెంచాలని, కరువు భత్యం (డీఏ) లింకు చేయాలని, పెన్షన్‌దారులకు వైద్య సౌకర్యం కల్పించాలని సిఫార్సు చేసిందన్నారు. వీటిని వెంటనే కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకురావాలని కోరారు. ధర్నాలో పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఐఎఫ్‌టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి యు. వెంకటేశ్వరరావు, ఈపీఎఫ్‌ పెన్షన్‌దారుల సంఘ నాయకులు కోసూరి నూకరాజు, బుద్దా నాగేశ్వరరావు, కొంపంగి కృష్ణ పాల్గొన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్‌ ఏలూరు జిల్లా యూనిట్‌కు ఈనెల 30న ఎన్నికలు నిర్వహించనున్నట్టు అసోసియేషన్‌ ఏలూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.ఆంజనేయులు, కె.మహాలక్ష్ముడు తెలిపారు. స్థానిక కోటదిబ్బ లోని సంఘ కార్యాలయంలో శనివారం జరి గిన సమావేశంలో ఈ మేరకు నోటిఫికేషన్‌ ఇ చ్చామన్నారు. ఎన్నికల అధికారిగా పశ్చిమగో దావరి జిల్లా సంఘ అధ్యక్షుడు జి.జేమ్స్‌, అసి స్టెంట్‌ ఎలక్షన్‌ ఆఫీసర్‌ సత్యనారాయణరాజు నోటీసు బోర్డులో ప్రదర్శనకు పెట్టారు. జిల్లాలోని తొమ్మిది మండలాలుగా ఉన్న అసోసియేషన్‌ సభ్యులు ఎన్నికల్లో పాల్గొనాలని కోరారు. అసోసియేషన్‌ కోశాధికారి డి.గంగాధర్‌ రావు, జిల్లా నాయకులు ఎ.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే ఏపీ పీజీ సెట్‌ నగరంలోని ఏలూరు ఇంజనీరింగ్‌ కళాశాలలో శనివారం మూడు షిఫ్టుల్లో జరిగింది. తొలి షిప్ట్‌లో 135 మందికి 106 మంది, రెండో షిఫ్టులో 65 మందికి 52 మంది, మూడో షిఫ్టులో 161 మందికి 150 మంది హాజరయ్యారు.

పెనుగొండ: కక్ష సాధింపుల్లో భాగంగానే అక్రమ కేసు బనాయించారని బెయిల్‌పై విడుదలైన వైస్సార్‌సీపీ నాయకుడు, కొడమంచిలి మాజీ సర్పంచ్‌ సుంకర సీతారామ్‌ ఆరోపించారు. శనివారం బెయిల్‌పై నరసాపురం సబ్‌ జైలు నుంచి ఆచంట చేరుకుని దివంగత సీఎం వైఎస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం లేనిపోని ఆరోపణలతో తప్పుడు కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తోందన్నారు. ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ నాయకులను టార్గెట్‌ చేసి స్థానిక ఎమ్మెల్యే ఫ్యాక్షన్‌ రాజకీయాలు తెరలేపారని విమర్శించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలు, కక్ష సాధింపులపై న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. మండల కన్వీనర్‌ జక్కంశెట్టి శ్రీరామ్‌, నాయకులు కోట వెంకటేశ్వరరావు, పాస్టర్‌ డేవిడ్‌ రాజు, జక్కంశెట్టి చంటి, పిల్లి రుద్రప్రసాద్‌, కేతా తాతారావు, కాండ్రేగుల కనకయ్య, పెచ్చెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పెదపాడు: అప్పనవీడులోని అభయాంజనేయస్వామి ఆలయంలో హనుమద్‌ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజు శనివారం ఆలయంలో చామంతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాధాకృష్ణ భ జన సమాజం (కొయ్యూరు) హనుమాన్‌ చాలీ పారాయణ చేశారు. కోలాటాలు, నృత్యాలు, పంచరత్నములు నాటకం ఆకట్టుకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement