చింతలపూడి : ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామంలో శనివారం పోలీసులు, ఎకై ్సజ్ సిబ్బంది సంయుక్తంగా భారీ స్థాయిలో శ్రీనవోదయం 2.0శ్రీ కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాలను ఉపయోగించి గ్రామం, పరిసర అటవీ ప్రాంతాలను జల్లెడ పట్టారు. కార్డన్ సెర్చ్‌లో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటిని అధికారులు తనిఖీ చేశారు. నాగిరెడ్డిగూడెం పరిధిలోని అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీ కోసం నిల్వ ఉంచిన సుమారు 200 లీటర్ల బెల్లపు ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 18 మోటార్ సైకిళ్లను శాఖ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ గ్రామస్తులతో మాట్లాడారు. నాటుసారా అనర్థాలను, ప్రాణాపాయాలను వివరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. దాడుల్లో ప్రోహిబిషన్ – ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీలత, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్, అసిస్టెంట్ కమిషనర్ ప్రభు కుమార్, జిల్లా ఎకై ్సజ్ అధికారి ఆవులయ్య, అసిస్టెంట్ సూపరింటెండెంట్ పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.
పెదపాడు: అనుమానాస్పద రీతిలో బాలుడు మృతి చెందిన సంఘటన పెదపాడు మండంలోని నాయుడుగూడెంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బండి రమేష్ కుమార్తె నీలిమ ప్రియాంకను నాయుడుగూడెం గ్రామానికి చెందిన పిట్టా వినోద్‌కు ఇచ్చి 12 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వారికి బాబు పుట్టిన తరువాత నీలిమ ప్రియాంకను అనుమానిస్తూ కాపురానికి తీసుకువెళ్లకుండా 9 ఏళ్లు కాలయాపన చేసాడు. దీంతో పుట్టింటిలోనే ఉంది. కుమారుడు రిషిబాబు(11) పెదపాడులోని శ్రీకృష్ణ గురుకులంలో చదువుకుంటున్నాడు. 2024లో పెద్దల సమక్షంలో భార్య, కుమారుడిని కాపురానికి తీసుకువెళ్లాడు. తరచూ అనుమానంతో పిల్లవాడిని నువ్వు నాకు పుట్టలేదంటూ వేధిస్తున్నట్లు నీలిమ ఐసీడీఎస్‌కి ఫిర్యాదు చేసింది. రిషిని ఓ గదిలో ఇనుపచైన్‌తో కట్టేసి కొట్టేవాడు. 9వ తేదీ ఉదయం 8.30 గంటల సమయంలో నాయుడుగూడెం ఇంటి చుట్టు పక్కల వారు రిషి తాతకు ఫోన్ చేసి మీ మనవడు చనిపోయాడని చెప్పడంతో ఇంటికి వెళ్లి చూసే సరికి బాలుడిని ఇంటిముందు మంచంపై పడుకోబెట్టారు. వీపు, చేతిపైన, కాళ్లపైన మెడపైన కమిలిన గాయాలు కనపడంతో తాత ఫిర్యాదు మేరకు పెదపాడు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముదినేపల్లి(కై కలూరు): తాత కట్టించిన ఇంట్లో తమకు వాటా ఇవ్వాలని ఓ వ్యక్తిని ముగ్గురు కలిసి కొట్టడంపై ముదినేపల్లి పోలీసు స్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తపల్లి గ్రామానికి చెందిన దాకరపు శ్రీనివాసరావు(50) ఇటీవల గుండె శస్త్ర చికిత్స చేయించుకుని ఇంటి వద్ద ఉన్నాడు. అన్నయ్య దాకరపు నారాయణ, చెందమ్మ, నాగలక్ష్మీలు అస్తి తమకు పంచి ఇవ్వాలని శ్రీనివాసరావుపై దాడి చేశారు. అడ్డువచ్చిన అతని భార్యపై దౌర్జన్యం చేశారు. ఆమెను గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు.


