మద్దిలో అభిషేక సేవ | - | Sakshi
Sakshi News home page

మద్దిలో అభిషేక సేవ

May 10 2026 7:58 AM | Updated on May 10 2026 7:58 AM

మద్దిలో అభిషేక సేవ లోక్‌ అదాలత్‌లో రాజీ చేసుకోవచ్చు రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

జంగారెడ్డిగూడెం : గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో శనివారం సందర్భంగా ఆంజనేయస్వామికి అభిషేక సేవ నిర్వహించారు. ఆలయ ముఖ మండపంపై ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో అభిషేకం నిర్వహించారు. ఆలయానికి వివిధ సేవల రూపేణా రూ.1,81,683 ఆదాయం వచ్చినట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు. నిత్యాన్నదాన సత్రంలో సుమారు 1779 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు ఈవో తెలిపారు.

నూజివీడు: గతంలో అనధికారికంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడి కేసుల్లో బుక్‌ అయిన నిందితులకు లోక్‌అదాలత్‌ ద్వారా తమ కేసులను పరిష్కరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఎకై ్సజ్‌ సీఐ ఏ మస్తానయ్య శనివారం పేర్కొన్నారు. స్థానిక ఎకై ్సజ్‌ స్టేషన్‌ వద్ద అనధికారికంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడిన నిందితులతో సమావేశం నిర్వహించిన ఎకై ్సజ్‌ సీఐ మాట్లాడుతూ తమపై ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం జీవోను విడుదల చేసిందన్నారు. పట్టుబడిన మద్యం సీసాల విలువకు మూడు రెట్లు జరిమానాను చెల్లిస్తే కేసులను లోక్‌అదాలత్‌ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు.

భీమవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందినట్లు భీమవరం టూటౌన్‌ ఎస్సై రామారావు శనివారం చెప్పారు. అత్తిలి మండలం లక్ష్మీ నారాయణపురం గ్రామానికి చెందిన పొలమరశెట్టి సాంబశివ(41) ఈ నెల 8 న తన ఇంటి నుంచి మోటారు సైకిల్‌పై గొల్లవానితిప్ప వెళ్తుండగా పరమ్మగుడి వద్ద బైక్‌ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. తలకు తీవ్రగాయం కావడంతో మరణించాడని అతని సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement