గైర్హాజరే ‘ప్రత్యేక’ం
8లో
న్యూస్‌రీల్
శనివారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రాష్ట్రంలో మొక్కజొన్న ది గుబడులు బాగా వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం క్వింటా రూ.2400లు మద్దతు ధర ప్రకటించింది.. అ యినా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. మద్దతు ధర రికార్డులకే పరిమితం తప్ప, క్షేత్రస్థాయిలో లేకపోవడంతో మొక్కజొన్న రైతు కుదేలయ్యాడు. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు నష్టం వాటిల్లే పరిస్థితుల్లో తప్పనిసరై కష్టాన్ని దళారులు పాలుజేసి ఇచ్చిందే తీసుకుంటున్నారు. మొక్కజొన్న పండించిన కౌలు రైతులు మరింత నష్టపోతున్నారు.
దిగుబడులు బాగున్నా..
జిల్లాలో ఈ ఏడాది మొక్కజొన్న దిగుబడులు గణనీయంగా వచ్చాయి. జిల్లావ్యాప్తంగా 80 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగితే కమర్షియల్ మొక్కజొన్న అత్యధికంగా 29,579 ఎకరాల్లో సాగయ్యింది. సాధారణ మొక్కజొన్న సీడ్ ఫౌండేషన్ స్థానికంగా ఉన్న కంపెనీలే ఇచ్చి కొంతమేరకు అడ్వాన్స్ రూపంలో ధరను నిర్ణయించి చెల్లింపులు జరిపి అగ్రిమెంట్లు చేసుకుని మరీ కొనుగోలు చేస్తుంటాయి. అయితే భారీ ధరలు ఉండకపోయినా గిట్టుబాటు అయ్యే పరిస్థితి. ఇక కమర్షియల్ మొ క్కజొన్న పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం. కోళ్ల దాణా, ఇతర అవసరాలకు ఎక్కువగా వినియోగిస్తారు. ఈ రకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తుంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏటా మార్కెట్ డిమాండ్, ఉత్పత్తిని ప్రామాణికంగా తీసుకుని మద్దతు ధర ప్రకటిస్తుంది. ఈ ఏడాది క్వింటాల్‌కు రూ.2,400 మద్దతు ధరను కేంద్రం సీజన్ ప్రారంభంలోనే నిర్ణయించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో జిల్లాలో ఎక్కడా మొక్కజొన్న కొను గోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో దళారులు నిర్ణయించిందే ధర అయ్యింది. సగటున క్వింటాల్ రూ.1,400 నుంచి రూ.1,700 వరకు దళారులు కొనుగోలు చేస్తున్నారు. పెట్టుబడులు గణనీయంగా పెరగడం, ఎకరాకు సగటున 30 క్వింటాళ్లు దిగుబడి వచ్చినా పెట్టుబడి రూ.60 వేలు దాటుతుండటం, ఇతర ఖర్చులతో సగటున ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల మేరకు నష్టం వాటిల్లుతోంది.
గత ప్రభుత్వంలో రూ.2,400 వరకు ధర
ఆరేళ్లలో మొక్కజొన్నకు గతేడాది నుంచి గడ్డుకాలం మొదలైంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2023లో అత్యధికంగా రూ.2,200 నుంచి రూ.2,400 ధరకు కొనుగోలు చేశారు. ఆ సమయంలో కేంద్రం మద్దతు ధర రూ.2,090గా ఉంది. అప్ప ట్లో మద్దతు ధరకు మించి కొనుగోలు చేయడం విశేషం. అయితే గతేడాది రూ.1,800, ఈ ఏడాది రూ.1,600కు కొనుగోళ్లు జరుగుతూ నానాటికీ ధరలు పడిపోతున్నాయి. కేంద్రం మద్దతు ధర ప్రకటించిన క్రమంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఎంఎస్‌పీ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రైతు సంఘాలు, అన్నదాతలు ఆందోళనలు చేసి తీవ్ర నిరసన తెలిపినా ప్రభుత్వం ఏ మాత్రం స్పందించని పరిస్థితి. ఇప్పటికే కొనుగోళ్లు సింహభాగం పూర్తయినా స్పందించకపోవడంతో దళారులు నిర్ణయించిన ధరలే కొనసాగుతున్నాయి.
నేను సుమారు 15 ఎకరాల్లో మొక్కజొన్న పండించాను. కేంద్రం మద్దతు ధర ప్రకటించినా, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవలేదు. దళారులు క్వింటా మొక్కజొన్నను రూ.1,800లోపు కొంటున్నారు. దీంతో క్వింటాకు రూ.600 నుంచి రూ.700 వరకు నష్టపోతున్నాం. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మద్దతు ధరకు కొనుగోలు చేయాలి.
– నరుకుళ్ల సుబ్బారావు, రైతు, రేచర్ల, చింతలపూడి మండలం
కూటమి ప్రభుత్వంలో మొక్కజొన్న రైతులకు అన్యాయం జరిగింది. గత ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో క్వింటాకు రూ.2,200 నుంచి రూ.2,300 వరకు ధర వచ్చింది. ప్రస్తుతం దళారులు క్వింటాకు రూ.1,600 నుంచి రూ.1,700 ఇస్తున్నారు. ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది.
– అంగడాల వెంకటేశ్వరరావు, రైతు, మేదినరావుపాలెం
మొక్కజొన్న కొనే నాథుడే లేడు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేశారు. రైతులకు న్యాయం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం కేంద్రాల ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేయడం లేదు. దీంతో కొనుగోలు ప్రక్రి య దళారుల చేతులకు వెళ్లింది. ప్రభుత్వ కేంద్రాల ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలి.
– గిరి భోగారావు, మాజీ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్, రాఘవాపురం
మొక్కజొన్న కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. సకాలంలో కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి. ప్రభుత్వ అసమర్థత కారణంగా రైతులు రూ.వేలల్లో నష్టపోయారు. రైతులకు ఎకరాకు రూ.20 వేలు నష్టపరిహారం అందించి ఆదుకోవాలి. ప్రతి గింజా మద్దతు ధరకు కొనాలి.
– దొంతా కృష్ణ, ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి, చింతలపూడి
టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల్లో గైర్హాజరేప్రత్యేకంగా నిలుస్తుంది.
రాష్ట్రం మొత్తం మొక్కజొన్న పంటను కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరతో కొనుగోలు చేయించాలంటే రూ.5 వేల కోట్లు కావాలి. మా వద్ద డబ్బులు లేవు. కేంద్ర ప్రభుత్వం ఏమైనా చెబితే అప్పుడు ఆలోచిస్తాం.
– ఇది రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతు సంఘ ప్రతినిధులకు చెప్పిన మాట
కూటమి ముంచేసింది
మద్దతు ధర రికార్డులకే పరిమితం
ప్రారంభం కాని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు
దళారులదే ఇష్టారాజ్యం
క్వింటాకు రూ.800 తక్కువకు కొనుగోలు
ఎకరాకు రూ.50 వేల వరకు నష్టం


