ఎవరో మహానుభావుడు సంక్రాంతి కల్లా గోతులు లేని రోడ్లు చూస్తారని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. కాని రెండు సంక్రాంతి పండుగలు గడిచినా గోతులు మాత్రం అలానే ఉన్నాయి. రాత్రివేళల్లో గోతులు కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. కొన్ని చోట్ల గోతులు పూడ్చినా అవి మళ్లీ అంతకుమించి ప్రమాదకర గోతులుగా మారాయి. ఇప్పటికై నా వాగ్ధానాలిచ్చిన నాయకులు స్పందించి కొత్త రోడ్డు వేయకపోయినా కనీసం గోతులైనా పూడ్చండి అంటూ నగరవాసులు మొత్తుకుంటున్నారు.
–సాక్షి ఫొటోగ్రాఫర్/ ఏలూరు


