ముస్లింలకు ఇంటర్‌ ఉచిత విద్య | - | Sakshi
Sakshi News home page

ముస్లింలకు ఇంటర్‌ ఉచిత విద్య

May 8 2026 11:14 AM | Updated on May 8 2026 11:14 AM

ముస్లింలకు ఇంటర్‌ ఉచిత విద్య

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): అర్హులైన ముస్లిం విద్యార్థులకు తాలీమ్‌ ఏ హునర్‌ పథకం కింద కార్పొరేట్‌ కళాశాలల్లో ఇంటర్మీడియెట్‌ ఉచిత విద్య అందించేందుకు ఈ నెల 17వ తేదీన టాలెంట్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నట్లు వక్ఫ్‌ బోర్డు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా ఇన్‌స్పెక్టర్‌ ఎండీ కరీముల్లా తెలిపారు. గురువారం స్థానిక తంగెళ్ళమూడి నెహర్‌ మసీదులో ఆయన వివరాలు వెల్లడించారు. ఆసక్తి కలిగిన ముస్లిం విద్యార్థులు ఏపీ వక్ఫ్‌బోర్డు వెబ్‌సైట్‌లో ఈ నెల 6వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుకు ఈనెల 12వ తేదీ తుది గడువు అని తెలిపారు. ఎస్‌ఎస్‌సీలో 450 ఆపైన మార్కులు సాధించిన విద్యార్థులు, సీబీఎస్‌/ఐసీఎస్‌ఈలో 75 శాతం ఆపైన మార్కులు సాధించి, ఆంధ్రప్రదేశ్‌ నివాసులై ఉండి, తెల్లరేషన్‌ కార్డుదారులు ఈ పథకానికి అర్హులన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement