ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి

May 8 2026 11:14 AM | Updated on May 8 2026 11:14 AM

నూజివీడు : పట్టణంలోని బస్టాండు వద్ద ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ప్రయాణికుడు దాడి చేసిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం విజయవాడలోని గవర్నర్‌పేట–2డిపోకు చెందిన 308 సర్వీసు విస్సన్నపేట నుంచి విజయవాడ వెళ్తుండగా సాయంత్రం 3:45 గంటల సమయంలో నూజివీడు బస్టాండుకు వచ్చింది. బస్టాండులోని పాయింట్‌లో డ్రైవర్‌ మేకా దుర్గాప్రసాద్‌(58) బస్సును ఆపి ప్రయాణీకులను ఎక్కించుకొని బస్టాండు అవుట్‌ గేట్‌ వద్దకు రాగా కండక్టర్‌ ఎం.శ్రీనివాసరావు బస్సును ముందు ఆపుతాం..ఎక్కొద్దంటూ వారిస్తున్నా ఇద్దరు వ్యక్తుల్లో వికలాంగుడూ బస్సు ఎక్కుతూ కిందపడ్డాడు. దీంతో వికలాంగుడి సోదరుడు డ్రైవర్‌పై గొడవపడి చెంపపైన చేతితో కొట్టాడు. దీంతో డ్రైవర్‌కు నోట్లో నుంచి ముక్కులో నుంచి రక్తం కారింది. దీంతో స్థానికులు వెంటనే డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై డ్రైవర్‌ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement