భూగర్భ జలాలు క్షీణిస్తుండడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని రైతులు గగ్గోలు పెడుతున్నారు. 8లో u
ఈ ఏడు మామిడి పంట దిగుబడి బాగా తక్కువ వచ్చింది. దాంతో పచ్చడి మామిడి కాయలకు మంచి ధర వస్తుందని ఆశించాం. ప్రస్తుతం కాయలు కొనేవారు లేరు. దాంతో తక్కువ ధరలకు కాయలను అమ్మాల్సి వస్తోంది. గతంతో పోలిస్తే పచ్చడి మామిడి కాయల విక్రయాలు బాగా తగ్గాయి.
–బడే చెన్నారావు,మామిడి కౌలు రైతు, ద్వారకాతిరుమల
పచ్చడి తయారీకి వినియోగించే ముడి సరుకుల ధరలు నింగినంటాయి. దాంతో వ్యయ ప్రయాసలు పడి పచ్చళ్లు పట్టడం ఎందుకని మానేశాం. ప్రజలకు రోజురోజుకు అనారోగ్య సమస్యలు పెరుగుతుండటం, మార్కెట్లో పలు రకాల పచ్చళ్లు దొరుకుతుండటం కూడా ఆవకాయ పచ్చడి పట్టేవారి సంఖ్య తగ్గడానికి ఒక కారణం.
– బండి శివ పార్వతి,
రాళ్లకుంట, ద్వారకాతిరుమల మండలం


