తడారి.. కొల్లేరు ఎడారి | - | Sakshi
Sakshi News home page

తడారి.. కొల్లేరు ఎడారి

May 5 2026 7:14 AM | Updated on May 5 2026 7:14 AM

అన్నదాన భవనానికి విరాళం 241 అర్జీల స్వీకరణ ప్రశాంతంగా లాసెట్‌ రైలు ఢీకొని వ్యక్తి మృతి సత్వర పరిష్కారం చూపాలి

న్యూస్‌రీల్‌

రెగ్యులేటర్ల మాటే మరిచారు

అన్నదాన భవనానికి విరాళం
కాళ్ల: కాళ్లకూరులో వేంకటేశ్వరస్వామి దేవస్థానం అన్నదాన భవనానికి వేగేశ్న వీఎస్‌ రాజు, కుమార్తెలు శ్రీఅంజలి, సంజన రూ.3 లక్షలు విరాళంగా అందించారు.

మంగళవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2026

ఏలూరు (టూటౌన్‌): స్థానిక కలెక్టరేట్‌లో సోమ వారం జరిగిన జిల్లాస్థాయి ప్రజా సమస్యలు పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఆధ్వర్యంలో అధికారులు 241 అర్జీలు స్వీకరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలన్నారు. ఏదైనా కారణంగా ఫిర్యాదు పరిష్కారం సాధ్యం కాకపోతే, కారణాలను లబ్ధిదారులకు అర్థమయ్యేలా ఎండార్స్‌మెంటు ఇవ్వాలని సూచించా రు. జేసీ ఎంజే అభిషేక్‌ గౌడ, అసిస్టెంట్‌ క లెక్టర్‌ సీహెచ్‌ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, ఇన్‌చార్జి డీఆర్వో ఎల్‌.దేవకీదేవి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కె.భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): లా కోర్సుల్లో ప్రవేశాల కోసం సోమవారం నగరంలో నిర్వహించిన లాసెట్‌కు 518 మంది విద్యార్థులు హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్‌ స్కూల్‌లో ఉదయం170 మందికి 134 మంది, మధ్యాహ్నం 171 మందికి 152 మంది, సీఆర్‌ఆర్‌ కళాశాలలో ఉదయం 200 మందికి 158 మంది, ఏలూరు ఇంజనీరింగ్‌ కళాశాలలో 92 మందికి 74 మంది హాజరయ్యారు.

భీమడోలు: బహిర్భూమికి వెళ్లిన మతిస్థిమితం లేని వ్యక్తిని సోమవారం వేకువజామున పాతూరు రైల్వే గేటు వద్ద రైలు ఢీకొట్టింది. దీంతో గుండుగొలను సమీపంలోని కొత్తగూడేనికి చెందిన నారాయణపురపు దుర్గారావు (43) మృతిచెందాడు. దుర్గారావు నెల రోజుల కితం పెళ్లికి వెళ్తున్నానని ఇంటి నుంచి బయటకు వచ్చి పరిసర ప్రాంతాల్లో మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో బహిర్భూమికి వెళ్లగా రైలు ఢీకొని మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఏలూరు రైల్వే ఎస్సై దానం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భీమవరం: స్థానిక పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి నిర్వహించారు. 16 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలపై త్వరితగతిన స్పందించి నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను ఫోన్‌లో ఆదేశించారు.

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రకృతి సోయగాలు, పక్షుల కిలకిలరావాలతో పచ్చటి తివాచీ పరుచుకున్నట్లు కనిపించే కొల్లేరు సరస్సు నీరులేక ఎడారిని తలపిస్తోంది. పాలకుల నిర్లక్ష్యంతో కొల్లేరుకు నీటి వనరుల లభ్యత కలగానే మిగులుతోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొల్లేరులో నిత్యం నీరు నిల్వ ఉండేలా రెగ్యులేటర్ల నిర్మాణానికి ముందడుగు వేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఆ దిశగా ఆలోచనే చేయడం లేదు. పోలవరం కాల్వల నుంచి కొల్లేరు సరస్సులోకి నీటిని మళ్లించే అంశం మాటలకే తప్పా అమలుకు నోచుకోవడం లేదు.

1.10 లక్షల క్యూసెక్యూల నీరు

కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి 67 డ్రె యిన్లు, వాగుల ద్వారా 1.10 లక్షల క్యూసెక్కుల నీ రు వరదల సమయంలో కొల్లేరులోకి చేరుతుంది. ప్రధానంగా బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు డ్రెయిన్ల నుంచి ఎక్కువ నీరు వస్తుంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది కొల్లేరులోకి నీటి ప్రవాహం తగ్గింది. దీంతో లక్షాలాది ఎకరాల కొల్లే రు భూములు బీటలు వారాయి. పర్యాటకులను ఆకర్షించే సహజసిద్ధ అందాలు నీరులేక కళావిహీనంగా తయారయ్యాయి. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా పక్షి ప్రేమికుల స్వర్గథామంగా మారిన ఆటపాక పక్షుల విహార కేంద్రంలో ఇప్పటికే నీరు లేక బోటు షికారును నిలుపుదల చేశారు.

పక్షుల తిరోగమనం

కొల్లేరు అభయారణ్యంలో 189 రకాల పక్షుల విహరిస్తున్నట్టు అంచనా. సైబీరియా, ఆస్ట్రేలియా, నైజీరియా వంటి పలు దేశాల నుంచి వలస పక్షులు విడిది కోసం వస్తాయి. ఇక్కడ వాతావరణం అనుకూలించడంతో అనేక పక్షులు కొల్లేరులో స్థిరనివాసం ఏర్పరుచుకుంటున్నాయి. ఇటువంటి పక్షులు కూడా నీరు లేక తిరోగమనం బాట పడుతున్నాయి. వేసవిలో పక్షులకు నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని పక్షి ప్రేమికులు కోరుతున్నారు. అయితే అటవీశాఖ అటువంటి ఏర్పాట్లు ఇప్పటికీ చేయలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రామ్‌సర్‌ సదస్సుతో గుర్తించిన ఏకై క చిత్తడి నేలల ప్రాంతం కొల్లేరు అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

చౌడుబారుతున్న భూములు

కొల్లేరు సరస్సులోకి ఏటా ఉప్పునీరు ప్రవేశించడం వల్ల ఉప్పుటేరు సమీప ప్రాంతాలు చౌడబారుతున్నాయి. అక్కడ వరి పంటకు అవకాశం ఉండటం లేదు. ఈ సమస్యను పరిష్కరించాలని రైతులు చాలా ఏళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రెగ్యులేటర్ల నిర్మాణం జరిగితే షట్లర్ల ద్వారా సముద్రపు నీటిని కొల్లేరుకు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. మరోపక్క వేసవిలో ఆక్వా చేపల చెరువులు తవ్వడానికి సిద్ధమవుతున్నారు. అటవీశాఖ అధికారులు కచ్చితంగా ఇటువంటి తవ్వకాలను అడ్డుకుంటామని ప్రకటిస్తున్నారు.

బీటలతో కళావిహీనంగా అందాల కొల్లేరు

నీటి కోసం పక్షుల విలవిల

నీటి వనరుల అభివృద్ధిలో ప్రభుత్వం విఫలం

రెగ్యులేటర్ల నిర్మాణం జరిగేనా?

పాదయాత్రలో కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రెగ్యులేటర్ల నిర్మాణానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఉప్పుటేరు ముఖద్వారం, చినగొల్లపాలెం, పెదలంక డ్రెయిన్‌పై డబుల్‌ లైన్‌ బ్రిడ్జి, గరిసిపూడి అండర్‌ టెన్నల్‌ నిర్మాణాలకు రూ.452 కోట్లు కేటాయించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మాటే మరిచింది. ఏటా ఏప్రిల్‌ నెల నుంచి మూడు నెలలు సముద్రపు నీరు కొల్లేరులో కలవడం వల్ల సరస్సులో సహజసిద్ధంగా పెరిగే నల్ల జాతి చేపలు అంతరించిపోతున్నాయి. ఇటువంటి సమస్యలు లేకుండా నిత్యం కొల్లేరులో నీరు నిల్వ ఉండాలంటే రెగ్యులేటర్లు నిర్మించాలి.

Advertisement
 
Advertisement
Advertisement