● ఏజెన్సీలో యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు
● చెరువుల్లో మట్టి ఇటుక బట్టీలకు..
● పట్టించుకోని అధికారులు
బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతం బుట్టాయగూడెం మండలంలో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా చెరువుల్లో మట్టిని పొక్లయిన్‌లతో తవ్వి టిప్పర్లు, ట్రాక్టర్లలో తరలిస్తూ లక్షలు గడిస్తున్నారు అక్రమార్కులు. మండలంలోని ఇటుకులకుంట, మెరకగూడెం సమీపంలో ఉన్న చెరువు భూమి చదును పేరుతో అనుమతులు తీసుకుంటున్న కొందరు వ్యక్తులు చెరువు మట్టిని ఇష్టారాజ్యంగా తవ్వుతూ మండలంతో పా టు కొయ్యలగూడెం ప్రాంతంలో ఇటుకల బట్టీలకు త రలిస్తున్నారు. ఒక్కో టిప్పర్ మట్టికి రూ.3,500 నుంచి రూ.4,000 వరకూ వసూలు చేస్తున్నారు. ఇలా ఇటుకులకుంట, మెరకగూడెం గ్రామాల సమీ పంలో ఉన్న మాలమెట్ట చెరువు నుంచి మట్టిని తరలిస్తున్నారు. అలాగే అక్రమార్కులు చెరువులతో పా టు కొండలు, గుట్టలనూ తవ్వేస్తున్నారని గిరిజన సంఘాల నాయకులు అంటున్నారు. గిరిజన ప్రాంతంలో నిబంధనలు మీరి మట్టి తవ్వకాలు జరుగుతు న్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. మైనింగ్ అధికారులు కనీసం ఇటువైపు చూడటం లేదని ఆవేదన చెందుతున్నారు. అక్రమ మ ట్టి తోలకాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా మట్టి అక్రమ రవాణాపై ఇరిగేషన్ అధికారులను వివరణ కోరగా తాము కేవలం చెరు వు భూమి చదునుకు, రైతుల అవసరాలకు మా త్రమే అనుమతి ఇచ్చినట్టు చెప్పారు. ఇటుక బట్టీలకు తరలించేందుకు అనుమతులు ఇవ్వలేదన్నారు.


