త్వరితగతిన న్యాయానికి కృషి | - | Sakshi
Sakshi News home page

త్వరితగతిన న్యాయానికి కృషి

May 5 2026 7:14 AM | Updated on May 5 2026 7:14 AM

మావుళ్లమ్మ నిత్యాన్నదానానికి..

మావుళ్లమ్మ నిత్యాన్నదానానికి..
భీమవరం (ప్రకాశంచౌక్‌): మావుళ్లమ్మవారి నిత్యాన్నదానానికి చినఅమిరానికి చెందిన కోరాడ శ్రీనివాస్‌, కీర్తి దంపతులు రూ.1,00,116 విరాళంగా అందజేశారు.

హైకోర్టు న్యాయమూర్తి రమేశ్‌

జంగారెడ్డిగూడెం: న్యాయం వేగవంతంగా అందించి, బాధితులకు రక్షణ కల్పించేందుకు న్యా యస్థానాలు కృషి చేస్తాయని హైకోర్టు న్యాయమూర్తి డి.రమేశ్‌ అన్నారు. పట్టణంలోని న్యాయస్థానాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టును సోమవారం హై కోర్టు న్యాయమూర్తులు ప్రారంభించారు. అలా గే కోర్టు ఆవరణలోని కోర్టు హాలు, చాంబర్‌, కా ర్యాలయ గది, బార్‌ అసోసియేషన్‌ గదులను ప్రారంభించారు. అనంతరం స్థానిక సూర్యకిర ణ్‌ ఫంక్షన్‌ హాల్‌లో జంగారెడ్డిగూడెం బార్‌ అ సోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీ య సమావేశానికి న్యాయమూర్తులు డి.రమేశ్‌, సత్తి సుబ్బారెడ్డి హాజరయ్యారు. కోర్టు సేవలను కక్షిదారులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవా లని వారు అన్నారు. జంగారెడ్డిగూడెం కోర్టు స ముదాయానికి నూతన ఫర్నిచర్‌, భవనాలు ని ర్మాణానికి కృషిచేస్తామన్నారు. జిల్లా న్యాయమూర్తి పి.శ్రీదేవి, జంగారెడ్డిగూడెం సీనియర్‌ సి విల్‌ జడ్జి కోర్టు న్యాయమూర్తి జీవీఎల్‌ సరస్వతి, ప్రిన్సిపల్‌ సివిల్‌ జడ్జి జూనియర్‌ డివిజన్‌ సీ హెచ్‌ కిశోర్‌బాబు, జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ క్లాస్‌ కేఎస్‌ఆర్‌ తేజస్వీ, స్పెషల్‌ జ్యు డీషియల్‌ ఆఫ్‌ సెకండ్‌ క్లాస్‌ నక్కా వెంకటేశ్వర్లు, బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement