ద్వారకాతిరుమల: దేవినేనివారిగూడెంలో పలు వ్యవసాయ భూముల్లో మోటారు కేబుల్ వైర్లను ఆదివారం దొంగలు కత్తిరించి అపహరించారు. సుమారు 20 మంది రైతుల పొల్లాలోని బోర్ల మోటార్లకు ఉన్న విద్యుత్ వైర్లను చోరీ చేశారు. రైతులు కమ్మ వెంకట సుబ్రహ్మణ్యం, ముళ్లపూడి శ్రీరామమూర్తి, నల్లూరి యుగంధర్, కమ్మ నాగన్న, ముళ్ళపూడి రామ్మోహనరావు తదితరులకు చెందిన వ్యవసాయ భూముల్లోకి గుర్తుతెలియని కొందరు దొంగలు ప్రవేశించారు. కాపర్ వైర్లు కోసం బోర్లుకు ఉన్న మోటారు వైర్లను కట్ చేసి చోరీ చేశారు. వేకువజామున పొలాలకు వెళ్లిన రైతులు చోరీలను గుర్తించి లబోదిబోమన్నారు. ఒక్క రాత్రిలో ఇంతమంది రైతుల పొలాల్లో విద్యుత్ కేబుల్ వైర్లు చోరీలు జరగడం కలకలం రేపింది. బాధితులు ఫిర్యాదులు చేసేందుకు పోలీస్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు.


