ద్వారకాతిరుమల: శ్రీవారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాల ముగింపును పురస్కరించుకుని ఆదివారం రాత్రి ఆలయంలో నిర్వహించిన శ్రీపుష్ప యాగోత్సవం నేత్రపర్వంగా జరిగింది. సుమారు 1,500 మంది మహిళలు హాజరయ్యారు. స్వామి, అమ్మవార్లకు ఈఓ వేండ్ర త్రినాథరావు సతీమణి భాగ్యలక్ష్మి 27 రకాల పండ్లు, పూలు, పసుపు, కుంకుమలు, గాజులను సమర్పించారు. అనంతరం పవళింపు సేవను జరిపారు. రాత్రి 11.30 గంటల వరకు వేడుకలు కనులపండువగా జరిగాయి. అనంతరం మహిళలకు పసుపు, కుంకుమలు, రవిక, గాజులు, కుంకుమ భరిణి, అరటి పండ్లను భాగ్యలక్ష్మి అందజేశారు.


