ఆన్‌లైన్ ద్వారా నగదు లావాదేవీలు జరపడం చాలా మంది పెద్దవారికి తెలియడం లేదు. తెలిసిన వారికి కౌంటర్ల వద్ద ఇబ్బందులు తప్పలేదు. కౌంటర్ల వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆన్‌లైన్ ద్వారా టికెట్లు తీసుకోవడానికి గంటల సమయం పట్టింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ కౌంటర్లను పెంచాలి. ఏవైనా సేవలు రద్దు చేస్తే వాటిని కియోస్క్‌ల నుంచి తొలగించాలి.
– బొప్పన సురేష్, భక్తుడు, అచ్చెన్నపాలెం, నల్లజర్ల మండలం
స్వామివారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా అష్టోత్తరం, తదితర సేవలను రద్దు చేశారు. కియోస్క్ మెషిన్‌లో ఆ సేవా టికెట్లు వచ్చాయి. వాటిని తీసుకుని ఆలయంలోకి వెళ్తే అక్కడ సిబ్బంది అష్టోత్తర సేవ జరగదన్నారు. ఏం చేయాలో మాకు అర్ధం కాలేదు. రూ.500 టికెట్ తీసుకున్న మా పరిస్థితి ఏంటని ప్రశ్నించగా, కొద్దిసేపటి తరువాత ఆ టికెట్‌పై దర్శనానికి పంపారు. చాలా ఇబ్బంది పడ్డాం.
– కరుటూరి నాగేంద్ర, అంకంపాలెం, ఆత్రేయపురం మండలం


