చిన వెంకన్నకు శ్రీచక్ర స్నానం | - | Sakshi
Sakshi News home page

చిన వెంకన్నకు శ్రీచక్ర స్నానం

May 3 2026 7:41 AM | Updated on May 3 2026 7:41 AM

చిన వెంకన్నకు శ్రీచక్ర స్నానం వీఆర్వోపై దాడి చేసిన నిందితుల అరెస్టు ఐసెట్‌కు 495 మంది హాజరు

ద్వారకాతిరుమల: శ్రీవారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు శనివారం శ్రీచక్ర స్నాన వేడుకను ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామి, అమ్మవార్లు తొళక్క వాహనంపై క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా ఊరేగారు. అనంతరం అర్చకులు ఆలయ యాగశాలలో శ్రీవారు, అమ్మవార్లు, శ్రీచక్ర పెరుమాళ్ల ఉత్సవ మూర్తులను ఒక వేదికపై వేంచేపు చేశారు. పూజాధికాల అనంతరం సుగంధ ద్రవ్యాలు, పంచ పల్లవులు, శ్రీచందనం, పసుపు, మంత్రపూత అభిషేక తీర్థంతో శ్రీచక్ర స్వామిని అభిషేకించారు. ఆ తరువాత శ్రీచక్ర పెరుమాళ్లతో పాటు ఉభయ నాంచారులకు, శ్రీవారికి తిరుమంజనాలు జరిపి, హారతులిచ్చారు. అభిషేక జలాన్ని భక్తుల శిరస్సులపై చల్లారు. సాయంత్రం ఆలయంలో నిత్యహోమ బలిహరణలు, పూర్ణాహుతి, అనంతరం ధ్వజ అవరోహణ వేడుకలను నిర్వహించారు. శ్రీవారి నవనీత కృష్ణ అలంకారం భక్తులకు కనువిందు చేసింది. రాత్రి స్వామివారికి అశ్వవాహనంపై తిరువీధి సేవను నిర్వహించారు. ఆదివారం రాత్రి జరిగే శ్రీపుష్ప యాగోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని, సోమవారం నుంచి నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను పునరుద్ధరిస్తామని దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు.

మండవల్లి: వీఆర్వోపై దాడి చేసి గాయపరచి, అతని విధులకు ఆటంకం కలిగించిన వారిని అరెస్టు చేసినట్లు ఎస్సై రామచంద్రరావు పేర్కొన్నారు. ఏప్రిల్‌ 29న దెయ్యంపాడులో వీఆర్వోపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ముంగర రాజు, ముంగర శ్రీనివాసరావు, ముంగర సావిత్రిని వారి ఇళ్ళ వద్ద అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్సై తెలిపారు. వారిని రిమాండు నిమిత్తం కై కలూరు కోర్టులో హాజరు పర్చినట్లు తెలిపారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఐసెట్‌ ప్రవేశ పరీక్ష శనివారం నగరంలోని రెండు పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో పరీక్షకు ఉదయం 146 మందికి 115 మంది హాజరు కాగా మధ్యాహ్నం 146 మందికి 123 మంది హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్‌ కేంద్రంలో నిర్వహించిన పరీక్షకు ఉదయం సెషన్‌లో 146 మందికి గాను 132 మంది హాజరు కాగా మధ్యాహ్నం సెషన్‌లో 146 మందికి గాను 125 మంది హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement