జగన్‌ హయాంలోనే పెట్టుబడులకు పునాది | - | Sakshi
Sakshi News home page

జగన్‌ హయాంలోనే పెట్టుబడులకు పునాది

May 2 2026 7:44 AM | Updated on May 2 2026 7:44 AM

జగన్‌ హయాంలోనే పెట్టుబడులకు పునాది శ్రీవారి సేవలో హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి ధాన్యం సమస్యల పరిష్కారానికి టోల్‌ఫ్రీ దేవదాయ శాఖ అధికారికి పదోన్నతి జాతీయ లోక్‌ అదాలత్‌ వాయిదా

దెందులూరు: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో విశాఖలో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లోనే గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్లకు పునాది పడిందని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి తెలిపారు. అప్పుడే ప్రధాన టెక్నాలజీ, ఇన్‌ఫ్రా సంస్థలతో చర్చలు ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. విశాఖలో గూగుల్‌, రిలయన్స్‌ భారీ డిజిటల్‌ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడాన్ని ఆయన స్వాగతించారు. పెట్టుబడులు రాష్ట్ర ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలను చేకూర్చేలా చూ డాలని కోరుతూ, ఇలాంటి భారీ డేటా సెంటర్ల కారణంగా ఏర్పడే సవాళ్లను తెలియజేస్తూ, వాటిని అధిగమించాల్సిన విధానాలపై సూ చనలను చేస్తూ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. డేటా సెంటర్ల నిర్వహణకు భారీగా నీటి వినియోగం అవసరమవుతుందని రీసైకిల్డ్‌ నీటిని వాడాలనే నిబంధన పెట్టాలని కోరా రు. విశాఖ తీర ప్రాంత సహజ పర్యావరణ, ఆర్థిక మౌలిక సదుపాయాలపై స్వతంత్ర కమిటీతో అధ్యయనం చేయించి, వాతావరణ ప రిస్థితులు, మౌలిక వసతుల భద్రతపై దృష్టి సారించాలని సూచించారు.

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు శుక్రవారం సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం అధికారులు, అర్చకులు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. రిటైర్డ్‌ న్యాయమూర్తి దంపతులు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేయించారు. అర్చకులు శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలకగా, అధికారులు చినవెంకన్న చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.

ఉంగుటూరు: ఏలూరు జిల్లాలో ధాన్యం కొనుగోలులో సమస్యల పరిష్కారానికి టోల్‌ఫ్రీ కంట్రోలు రూం నం. 18004256453, హెల్ప్‌ డెస్క్‌ 77020 03584కి ఫోన్‌ చేసి తెలియజేయా లని జేసీ అభిషేక్‌ గౌడ్‌ తెలిపారు. శుక్రవారం మండలంలోని తల్లాపురం రోడ్డులో, చేబ్రో లు, నారాయణపురం ఆయకట్టు ప్రాంతాల్లో ధాన్యం ఎగుమతులను ఆయన పరిశీలించా రు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 58 లక్షల గోనె సంచులు అందుబాటులో ఉంచామన్నారు. ఇప్పటివరకూ 1.55 లక్షల టన్నుల ధాన్యం సేకరించామన్నారు. వర్షాలతో ధాన్యం దెబ్బతినకుండా టార్పాలిన్లు సిద్ధం చేశామన్నారు. ఉంగుటూరు మండలంలో 53,485 టన్ను ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని అన్నారు. రైతులు సొంతంగా ఏర్పాటు చేసుకునే గోనె సంచికి రూ.4.47, హమాలీలకు క్వింటాల్‌కు రూ.25.06 చొప్పున చెల్లిస్తామన్నారు. అనంతరం కైకరంలో రైతు సేవా కేంద్రాన్ని జేసీ పరిశీలించి రైతులతో మాట్లాడారు. సివిల్‌ సప్లయీస్‌ జిల్లా మేనేజర్‌ పి.శివరామమూర్తి, జిల్లా సహకార శాఖ అధికారి ఆరిమిల్లి శ్రీనివాస్‌, త హసీల్దార్‌ పూర్ణచంద్రప్రసాద్‌ ఉన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): భీమవరం డివిజన్‌ దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ వర్ధినీడి వెంకటేశ్వరరావుకు కాకినాడ జిల్లా దేవదాయశాఖ అధికారిగా (డీఈఓ) పదోన్నతి లభించింది. ఆయనకు డివిజన్‌ ఈఓలు అభినందనలు తెలిపారు.

భీమవరం: జిల్లాలో ఈనెల 9న జరగాల్సిన జాతీయ లోక్‌ అదాలత్‌ జూలై 11కి వాయిదా పడినట్టు భీమవరం మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్‌ బి.లక్ష్మీనారాయణ శుక్రవారం ప్రకటనలో తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement