కై కలూరు: కై కలూరు మండలం గోపవరంలో వడదెబ్బ తగిలి ఓ మహిళ మరణించింది. కై కలూరు టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జంగం వెంకటేశ్వరమ్మ (50) భర్త లేకపోవడంతో అదే గ్రామంలో కూతురు వంగలపాటి శాంతి స్పందన వద్ద ఉంటోంది. గురువారం గ్రామంలో కాగితాల కొండమ్మ, ఆమె కూతురు గడిదేశి కృష్ణ తులసిల నుంచి అప్పు డబ్బు రావల్సి ఉంటే అడగడానికి మధ్యాహ్నం కూతురుతో కలిసి వెళ్లింది. అక్కడ కొంత ఘర్షణ జరిగింది. అనంతరం వెంకటేశ్వరమ్మ ఇంటి వద్ద అంట్లు తోముతూ కుప్పకూ లడంతో కై కలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మరణించిందని చెప్పారు. తల్లి మూడు రోజులుగా కూలి పనులకు సైతం వెళుతోందని, వడదెబ్బ తగిలి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. కుమార్తె ఫిర్యాదుతో టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.


