వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో దోమ తెరల పంపిణీ
బుట్టాయగూడెం: జిల్లాలోని మన్యం ప్రాంతంలో మలేరియా జ్వరాలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టకపోవడంపై గిరిజన సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ప్రస్తుతం గిరిజన పల్లెల్లో మలేరియా, టైఫాయిడ్ కేసులు న మోదవుతున్నాయి. ఈ ఏడాదిలో జనవరి నుంచి ఇప్పటివరకూ సుమారు 33 మలేరియా కేసులు నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే వర్షాలు కురిస్తే ఎలా ఉంటుందోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. దోమల నివారణలో భాగంగా దోమ తెరల పంపిణీని కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో 220 మలేరియా సమస్యాత్మక గ్రామాలను అధికారులు గుర్తించారు.
రెండింతల కేసులు
గిరిజన ప్రాంతంలో సుమారు 33 మలేరి యా కేసులు నమోదైనట్టు అధికారులు చెబుతున్నా.. వాస్తవానికి రెండింతల కేసులు ఉంటాయని అంచనా. అధికారులు వాస్తవాలను దాస్తున్నారని గిరిజన సంఘ నాయకు లు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో న మోదవుతున్న కేసుల కంటే కంటే రికార్డుల్లో తక్కువ చూపిస్తున్నారని అంటున్నారు. అ లాగే ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదైన కేసుల ను లెక్కలోకి తీసుకోవడం లేదని అంటున్నారు.
స్ప్రేయింగ్ చేసినా..
మలేరియా నివారణలో భాగంగా ఏటా మూడు దశల్లో మలాథియన్ స్ప్రేయింగ్ పనులు చేస్తుంటారు. గతేడాది మూడు దశల్లో పనులు చేసినా మలేరియా కేసులు అధికంగా పెరిగాయి. దోమ తెరలతోనే నివారణ సాధ్యమని గిరిజనులు అంటున్నారు. అ యితే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా దోమ తెరల పంపిణీపై ఎటువంటి చర్యలు చేపట్టలేదని, మలేరియా జ్వరాల నివారణకు కృషి చేయాలని గిరిజన సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.
బుట్టాయగూడెం సీహెచ్‌సీలో మలేరియాతో వైద్యం పొందుతున్న సరియం గంగరాజు
టైఫాయిడ్, మలేరియా, కామెర్లతో వైద్యం పొందుతున్న కరకాల గంగమ్మ
గిరిజన గ్రామాల్లో మలేరియా నియంత్రణకు గత వైస్సార్‌సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేసింది. గ్రామాల్లో దో మలను అరికట్టేందుకు అధికారులు పగక్బందీగా చర్యలు చేపట్టారు. 2021లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం సంస్థ (ఎన్‌విబీడీసీపీ) నుంచి సుమారు 2.50 లక్షల దోమ తెరలను రప్పించి బుట్టాయగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో పంపిణీ చేయించా రు. అలాగే గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు దోమ తెరలు పంపిణీ చేశారు. 2024 జనవరిలో దోమ తెరల కోసం వైద్యారోగ్య శాఖ ద్వారా ప్రతిపాదనలు కూడా పంపించారు.
గిరిజన ప్రాంతాల్లోపెరుగుతున్న కేసులు
సుమారు 220 సమస్యాత్మక గ్రామాలు గుర్తింపు
మొక్కుబడిగా నియంత్రణ చర్యలు
రెండేళ్లుగా నిలిచిన దోమ తెరల పంపిణీ
గత ప్రభుత్వంలో 2.50 లక్షల దోమ తెరల పంపిణీ


