జగన్‌ 2.0 పాలన ఖాయం | - | Sakshi
Sakshi News home page

జగన్‌ 2.0 పాలన ఖాయం

Apr 30 2026 8:49 AM | Updated on Apr 30 2026 8:49 AM

భూసారానికి ముప్పు జగన్‌ 2.0 పాలన ఖాయం

భూసారానికి ముప్పు
వరి చేలలో ఎండుగడ్డి, వరి మోళ్లను తగలబెట్టడం వల్ల నేలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వ్యవసాయ అధికారులు అంటున్నారు. 8లో u

కొయ్యలగూడెం: జగన్‌ 2.0 పాలన ఖాయమని, ప్రజలు మళ్లీ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన కోసం ఆత్రుతతో ఎదురుచూస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. బుధవారం బయ్యన్నగూడెంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోతన తాతారావు నివాసానికి విచ్చేసిన సందర్భంగా ఆయన పార్టీ నేతలతో ముచ్చటించారు. కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కక్ష సాధింపునకు వాడుకుంటున్న రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి జగన్‌ తీసుకువచ్చిన డిజిటల్‌ బుక్‌ చమరగీతం పాడనుందన్నారు. జగన్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు, అమలు చేసిన అభివృద్ధికి కొత్త పేర్లు తగిలిస్తూ తాను పబ్లిసిటీ సీఎంని అంటూ మరోసారి చంద్రబాబు నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. బలమైన సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని పాలనలోకి వచ్చిన పవన్‌కల్యాణ్‌ వారి అభివృద్ధి గురించి నోరు మెదపకపోవడం ఆ సామాజికవర్గంలో తీవ్ర నైరాశ్యం నింపిందన్నారు. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు న్యా యం చేయగల నేత జగన్‌ మాత్రమేనని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. పోలవరం నియోజకవర్గం వైఎస్సార్‌సీపీకి కంచుకోట వంటిదని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెల్లం బాలరాజును మంత్రిగా నియోజకవర్గ ప్రజలు చూడబోతున్నారంటూ పే ర్కొన్నారు. పార్టీ నాయకులు కంచర్ల సత్యనారాయణ, దొండపాటి సత్తిరెడ్డి, పోతన చైతన్య, మిరియాల సుందరం, పోతన కృష్ణ కిషోర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement