రెండేళ్ల నుంచి దోమ తెరలు పంపిణీ లేదు. గతంలో ఇచ్చిన దోమ తెరలు చిరిగిపోయాయి. మా గ్రామాల్లో దోమలు విపరీతంగా ఉన్నాయి. దోమ తెరల కోసం ఎదురు చూస్తున్నాం. వెంటనే పంపిణీ చేయాలి.
– నడపల ముక్కారెడ్డి, గడ్డపల్లి, పోలవరం మండలం
కూటమి ప్రభుత్వానికి దోమ తెరల పంపిణీపై చిత్తశుద్ధి లేదు. అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటివరకూ పంపిణీ చేయలేదు. ప్రస్తుతం గ్రామాల్లో మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇంటికొక్కరు బాధపడుతున్నారు.
– కారం రాఘవ, ఏఐకేఎంఎస్ నాయకులు, అలివేరు
జిల్లాలో మలేరియా నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాం. దీనికోసం సుమారు 2.50 లక్షల దోమ తెరలు అవసరమని కీటక జనిత వ్యాధులు నివారణ సంస్థకు ప్రతిపాదనలు పంపించాం. వచ్చిన వెంటనే పంపిణీ చేస్తాం.
– ఎన్‌ఎస్‌ఎస్ ప్రసాద్, జిల్లా మలేరియా అధికారి, కేఆర్‌పురం


