భీమవరం: కేసులు ఎక్కువ సంఖ్యలో రాజీచేయడం ద్వారా వచ్చేనెల 9న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని భీమవరం 3వ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్, పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి బి.లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం భీమవ రంలో పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కక్షిదారుల్లో లోక్ అదాలత్ రాజీలపై అవగాహన కల్పించాలన్నారు. ఎటువంటి ఇబ్బందులున్నా న్యాయమూర్తుల దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి ప్రయత్నం చేస్తామన్నారు. ఎకై ్సజ్ కేసుల్లో కాంపౌండ్ ఫీజు కట్టించి అ వార్డు కాపీలను దాఖలు చేసుకోవచ్చన్నారు. భీమవరం, ఆకివీడు, ఉండి, కాళ్ల, పాలకోడేరు, వీరవాస రం పోలీసు అధికారులు, భీమవరం, ఆకివీడు ఎకై ్స జ్ పోలీసు స్టేషన్ల అఽధికారులు పాల్గొన్నారు.


