శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాన్ని గురువారం రాత్రి వైభవంగా నిర్వహించేందుకు దేవస్ధానం అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ తూర్పు రాజగోపురం వద్ద భారీ వేదికను నిర్మిస్తున్నారు. ఈఓ వేండ్ర త్రినాథరావు పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. స్వామివారు ఆలయం నుంచి తూర్పురాజగోపురం మీదుగా కల్యాణ వేదిక వద్దకు రాత్రి 7.30 గంటల సమయంలో చేరుకుంటారు. 8 గంటల నుంచి కల్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. శుక్రవారం రాత్రి శ్రీవారి రథోత్సవం జరుగనుండగా, ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నారు.


