రూ.3.82 లక్షలకు దొడ్డిపట్ల ఫెర్రీ | - | Sakshi
Sakshi News home page

రూ.3.82 లక్షలకు దొడ్డిపట్ల ఫెర్రీ

Apr 30 2026 8:37 AM | Updated on Apr 30 2026 8:37 AM

రూ.3.82 లక్షలకు దొడ్డిపట్ల ఫెర్రీ

యలమంచిలి: స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం 2026–27 సంవత్సరానికి దొడ్డిపట్ల ఫెర్రీ వేలం నిర్వహించారు. ప్రభుత్వం నిర్ణయించిన రూ.3,50,000 ధరకు వేలం ప్రారంభించగా దొడ్డిపట్ల గ్రామానికి చెందిన చేగొండి వీర వెంకట రమణ రూ.3.82 లక్షలకు పాట దక్కించుకున్నారు. ఫెర్రీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సభ్యులు ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మీ, ఎంపీడీఓ జేడీవీ ప్రసాద్‌, ఎంపీడీఓ కార్యాలయ పరిపాలన అధికారి పద్మజ తదితరులు ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. వేలం పాటపై నివేదికను జిల్లా పరిషత్‌ సీఈఓకు పంపుతామని ఆయన నుంచి అనుమతి వచ్చిన తరువాత వేలం ఖరారు చేస్తామని ఎంపీడీఓ జేడీవీ ప్రసాద్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement