వీఆర్వోపై దాడి | - | Sakshi
Sakshi News home page

వీఆర్వోపై దాడి

Apr 30 2026 8:37 AM | Updated on Apr 30 2026 8:37 AM

వీఆర్వోపై దాడి నూజివీడు సీడ్స్‌ ఫ్యాక్టరీలో తనిఖీలు రాష్ట్రానికి అంటువ్యాధిగా మతోన్మాదం యథేచ్ఛగా మట్టి తరలింపు

మండవల్లి: ప్రభుత్వ భూమి పూడ్చివేతపై పరిశీలనకు వెళ్ళిన పులపర్రు వీఆర్వో ముద్రబోయిన వెంకటేష్‌పై బుధవారం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దాడిచేసి గాయపర్చారు. వీఆర్వో కై కలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తహసీల్దార్‌ గోపాల్‌ ఆదేశాల మేరకు పులపర్రులో పరిశీలనకువె వెళ్ళిన వీఆర్వోపై ముంగర రాజు, ముంగర సావిత్రి, ముంగర శ్రీనివాసరావు దాడి చేశారు.

దెందులూరు: పెదవేగి మండలం విజయరాయి నూజివీడు సీడ్స్‌ ఫ్యాక్టరీలో బుధవారం తనిఖీలు జరిగాయి. నిషేధిత పత్తి విత్తనాల తయారీని అరికట్టేందుకు విజిలెన్స్‌ సిబ్బంది ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు.

తాడేపల్లిగూడెం (టీఓసీ): రాష్ట్రానికి మతోన్మాదం అంటువ్యాధిగా మారిందని, కూటమి ప్రభుత్వం దానిని రాజకీయ అజెండాగా మార్చేసిందని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ భవనంలో బుధవారం అమెరికా యుద్ధోన్మాదం కారణాలు, ప్రభావాలు అంశంపై సెమినార్‌ నిర్వహించారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కర్రి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆర్‌ఎస్‌ఎస్‌ ఆవహించిందని, మోదీని ప్రసన్నం చేసుకునేందుకు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని వ్యాఖ్యానించారు. ఆకివీడు ఘటనను క్రిస్టియన్‌, హిందువుల మధ్య విభేదంగా సృష్టించారని, దీనికి డిప్యూటీ స్పీకర్‌ కనుమూరి రఘురామకృష్ణరాజు వైఖరే కారణం అన్నారు. ప్రపంచ దేశాలన్నీ డాలర్‌ను వ్యతిరేకిస్తుంటే అదే డాలర్‌ను ప్రోత్సహిస్తున్న వ్యక్తి మోదీ మాత్రమేనని విమర్శించారు. ఎన్నికల కమిషన్‌ను కూడా రాజకీయ వ్యూహంలో ఉపయోగించడం రాజ్యాగ విరుద్ధమన్నారు. బీజేపీకి ఓటు వేయకపోతే ఆ ఓటును తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

ఆగిరిపల్లి: మండలంలోని ఈదులగూడెంలో టీడీపీ నాయకుడు చెరువులోని మట్టిని గత రెండు రోజుల నుంచి రాత్రిపూట తరలిస్తున్నాడు. మండలంలోని ఈదులగూడెంలో ఏడు నెలల క్రితం టీడీపీకి చెందిన నాయకుడు గ్రామంలో పొలాల మెరక కోసమని అనుమతి తీసుకొని సుమారు 4 వేల ట్రక్కుల మట్టిని అక్రమంగా ఈదులగూడెంలో నిల్వ ఉంచాడు. ఇటుక బట్టీలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా సాక్షిలో అక్రమంగా మట్టి నిల్వలు కథనం ప్రచురితమైంది. అధికారులు మట్టిని తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో విరమించుకున్నాడు. గత రెండు రోజుల నుంచి రాత్రిపూట లారీల్లో వీరపనేనిగూడెంలోని ఇటుక బట్టీలకు తరలించేస్తున్నాడు. తహసీల్దార్‌కు సమాచారం అందడంతో ఆయన ఆదేశాల మేరకు ఆర్‌ఐ యూనస్‌ ఆ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ ఉన్న లారీని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement