హత్య కేసులో నిందితుడి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

హత్య కేసులో నిందితుడి అరెస్టు

Apr 30 2026 8:37 AM | Updated on Apr 30 2026 8:37 AM

హత్య కేసులో నిందితుడి అరెస్టు

తాడేపల్లిగూడెం అర్బన్‌ : స్థానిక యాగర్లపల్లిలో ఈ నెల 14న పెరుమాళ్ళ నాగమణి(76) హత్య కేసులో నిందితుడి వివరాలను డీఎస్పీ డి.విశ్వనాథ్‌ వెల్లడించారు. నాగమణి హోటల్‌ వ్యాపారం చేసుకుంటూ జీవించేది. అదే ప్రాంతానికి చెందిన దగ్గుపల్లి దుర్గాప్రసాద్‌ కూలి పని చేసేవాడు. వ్యసనాలతో అప్పుల పాలయ్యాడు. దీంతో నాగమణితో పరిచయం పెంచుకొని ఈ నెల 14న అర్ధరాత్రి ప్రసాద్‌ ఇంట్లోకి ప్రవేశించి నాగమణి తలపై బండరాయితో మోది హత్య చేశాడు. ఇంట్లో నగదుతో పాటు రూ.3,45,500 విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. నాగమణి బంధువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రసాద్‌ స్థానిక మహాలక్ష్మి నగర్‌ సమీపంలో ఉన్నట్లు సమాచారం అందడంతో సీఐ బోణం ఆదిప్రసాద్‌ ఎస్‌ఐలు పి.నాగరాజు, బి.శ్రీనివాస్‌ బృందాలుగా వెళ్ళి వల పన్ని అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన సిమెంట్‌ రాయిని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement