గొల్ల బాబూరావును అవమానించడం బాధాకరం | - | Sakshi
Sakshi News home page

గొల్ల బాబూరావును అవమానించడం బాధాకరం

Apr 30 2026 8:37 AM | Updated on Apr 30 2026 8:37 AM

ఏలూరు (టూటౌన్‌): ఆంధ్ర విశ్వ విద్యాలయం శతాబ్ది ఉత్సవాల వేడుకల్లో రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావును ఉద్దేశపూర్వకంగా అవమానించడం బాధాకరమని, విశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష చూపడం సిగ్గు చేటైన విషయమని పలువురు దళిత నాయకులు విమర్శించారు. స్థానిక ఎన్‌ఆర్‌పేటలోని ఆలిండియా అంబేడ్కర్‌ యువజన సంఘం రాష్ట్ర కార్యాలయంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. ఏఐఏవైఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి డా.మెండెం సంతోష్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రొటోకాల్‌ ప్రకారం ఆహ్వాన పత్రికలో బాబూరావు పేరును వేసి వేదికపైకి పిలవకపోవడం యూనివర్శిటీ అధికారుల పక్షపాత ధోరణికి నిదర్శనమన్నారు. ఆహ్వాన పత్రికలో లేని వారిని ప్రొటోకాల్‌ను పక్కనబెట్టి వేదిక మీదకు పిలిచారన్నారు. రాజ్యసభ సభ్యుడిగా, యూనివర్శిటీ ఓల్డ్‌ స్టూడెంట్‌గా ఉన్న బాబూరావును పిలిచి మరీ అవమానించడం హేయమైన చర్య అన్నారు. ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు తేరా ఆనంద్‌, రాష్ట్ర కార్యదర్శి నిట్టా గంగరాజు, వైఎస్సార్‌సీపీ నాయకులు పల్లెం ప్రసాద్‌, పాకా ప్రభాకరరావు, బత్తిన ప్రభాకరరావు మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement