మత సామరస్యానికి ప్రతీక రంజాన్‌ | - | Sakshi
Sakshi News home page

మత సామరస్యానికి ప్రతీక రంజాన్‌

Mar 19 2026 7:54 AM | Updated on Mar 19 2026 7:54 AM

మత సామరస్యానికి ప్రతీక రంజాన్‌ మౌజన్‌ల బకాయిలు విడుదల ఈసీ సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్‌ ఇవ్వాలి టీడీపీలో ఆధిపత్య పోరు

ఏలూరు (టూటౌన్‌): సర్వ మానవాళి సుఖసంతోషాలు రంజాన్‌ ప్రార్థనల ముఖ్యోద్దేశం అని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి అన్నారు. స్థానిక గిరిజన భవన్‌లో మైనారిటీస్‌ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఇఫ్తార్‌ కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ మతసామరస్యానికి ప్రతీక రంజాన్‌ మాసమన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి), మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)/ఏలూరు (టూటౌన్‌): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మసీదుల్లో పని చేస్తున్న ఇమామ్‌, మౌజన్‌లకు ప్రభుత్వం అందిస్తున్న గౌరవ వేతనం బకాయిలను ప్రభుత్వం విడుదల చేసిందని వక్ఫ్‌బోర్డ్‌ ఇన్స్‌పెక్టర్‌ ఎండీ కరీముల్లా ఒక ప్రకటనలో తెలిపారు. 6 నెలల బకాయిల మొత్తం రూ.1,86,30,000 ఆయా మసీదుల బ్యాంకుల ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు.

ఏలూరు (టూటౌన్‌): ఈ నెల 27న జరగనున్న ఏలూరు బార్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్‌ సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ చేయాలని పలువురు న్యాయవాదులు కోరారు. ఈ మేరకు బుధవారం అమరావతిలోని ఏపీ స్టేట్‌ బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శి బి.పద్మావతికి న్యాయవాది ప్రత్తిపాటి తంబి ఆధ్వర్యంలో న్యాయవాదులు వినతి పత్రం అందజేశారు. దీనిపై కార్యదర్శి పద్మావతి స్పందిస్తూ బార్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో ఈసీ సభ్యుల ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో బార్‌ అసోసియేషన్‌ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

భీమవరం: భీమవరం టీడీపీలో ఆధిపత్యపోరు మరోసారి బయటపడింది. భీమవరం కొత్త బస్టాండ్‌ ఆవరణలో బుధవారం జరిగిన దివ్యాంగ శక్తి ప్రారంభ సభ ఇందుకు వేదికగా మారింది. ఈ కార్యక్రమంలో వేదికపైకి ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును పిలిచిన తర్వాత టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథిని వేదికపైకి పిలిచారు. అనంతరం మాజీ ఎంపీ, భీమవరం నియోజకవర్గ ఇన్‌చార్జి తోట సీతారామలక్ష్మిని పిలవడం గొడవకు కారణమైంది. అధికారులకు ప్రొటోకాల్‌ తెలియదా అంటూ మండిపడి వేదికపైకి వెళ్లడానికి ఆమె నిరాకరించారు. దీంతో టీడీపీ నాయకులంతా ఆమె చుట్టూ చేరడం, రగడను కవర్‌ చేస్తున్న విలేకరులను పోలీసులు పక్కకు తోయడం గందరగోళంగా మారింది. జిల్లా అధికారులు సీతారామలక్ష్మికి నచ్చచెప్పి పొరపాటు జరిగిందంటూ వేడుకున్నా ఆమె ససేమిరా అనడంతో కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. చివరకు కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి కలగజేసుకుని సీతారామలక్ష్మిని వేదికపైకి పిలవడమేగాక చేయిపట్టుకుని వేదిక ఎక్కించారు. టీడీపీలో ఇప్పటికే కొనసాగుతున్న ఆధిపత్యపోరు ఈ సంఘటనతో మరోసారి బయటపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement