విర్డ్‌ ఆస్పత్రికి ఆపరేషన్‌ పరికరాల అందజేత | - | Sakshi
Sakshi News home page

విర్డ్‌ ఆస్పత్రికి ఆపరేషన్‌ పరికరాల అందజేత

Feb 27 2026 7:36 AM | Updated on Feb 27 2026 7:36 AM

విర్డ్‌ ఆస్పత్రికి ఆపరేషన్‌ పరికరాల అందజేత

విర్డ్‌ ఆస్పత్రికి ఆపరేషన్‌ పరికరాల అందజేత

విర్డ్‌ ఆస్పత్రికి ఆపరేషన్‌ పరికరాల అందజేత పోస్టాఫీస్‌లో చోరీ

ద్వారకాతిరుమల: స్థానిక విర్డ్‌ ఆస్పత్రికి ద్వారకాతిరుమలలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) వారు సీఎస్‌ఆర్‌ యాక్టివిటీస్‌లో భాగంగా రూ. 7,00,053 విలువైన ఆపరేషన్‌ పరికరాలను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంక్‌ ప్రతినిధులు మాట్లాడుతూ సమాజ అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం కోసం సహాయాన్ని అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ ఏలూరు జిల్లా రీజనల్‌ మేనేజర్‌ పక్కల కాళిదాసు, ద్వారకాతిరుమల బ్రాంచ్‌ మేనేజర్‌ మీనా కుమార్‌, విర్డ్‌ ఆస్పత్రి చైర్మన్‌ ఎస్వీ సుధాకరరావు, శ్రీవారి దేవస్థానం ఈఓ యర్రంశెట్టి భద్రజీ, ట్రస్ట్‌ సభ్యులు, ఆస్పత్రి వైద్యులు పాల్గొన్నారు.

కామవరపుకోట : స్థానిక పోస్టాఫీస్‌ కార్యాలయంలో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు పోస్టాఫీస్‌ తాళాలు పగలగొట్టి కార్యాలయంలో ఉన్న రికార్డులను చిందర వందర చేశారు. అంతేగాకుండా బీరువాలో ఉన్న ఖాళీ పాస్‌పుస్తకాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై గురువారం ఉదయం పోస్ట్‌ మాస్టర్‌ ఎం.మనోజ్‌ తడికలపూడి పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై చెన్నారావు ఘటనా స్థలాన్ని పరిశలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement