చోరీ కేసుల్లో ఆరుగురి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసుల్లో ఆరుగురి అరెస్ట్‌

Feb 27 2026 7:34 AM | Updated on Feb 27 2026 7:34 AM

చోరీ

చోరీ కేసుల్లో ఆరుగురి అరెస్ట్‌

చోరీ కేసుల్లో ఆరుగురి అరెస్ట్‌

న్యూస్‌రీల్‌

నిబంధనలు మీరితే చర్యలు

ప్రో బయోటిక్స్‌ బెటర్‌

మూడు వేర్వేరు చోరీ కేసులకు సంబంధించి నిందితులు ఆరుగురిని పోలీసులు అరెస్ట్‌ చేసినట్టు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత తెలిపారు. 8లో u

శురకవారం శ్రీ 27 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

కై కలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా మందుల షాపులు సుమారు 1,104, ఆక్వా ల్యాబ్‌లు 237 ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ ల్యాబ్‌లు 35, ప్రైవేటు ల్యాబ్‌లు 202 పనిచేస్తున్నాయి. ఏలూరు జిల్లాలో 335 ఆక్వా మందుల దుకాణాలు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (అప్సడా) అనుమతులు కఠినతరంగా ఉన్నా కొల్లేరు పరీవాహక ప్రాంతాల్లో ఆక్వా దుకాణాలు ఇబ్బడిమబ్బడిగా వెలుస్తున్నాయి. ఇటీవల నాసిరకం మందులు అంటగట్టడంతో రైతులు దుకాణదారులపై తిరగబడుతున్నారు.

యాంటీ బయోటిక్స్‌ అంటే

యాంటీ బయోటిక్స్‌.. బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యా ధులను నివారించడానికి, చికిత్స చేయడానికి ఉపయోగించే రసాయన పదార్థాలు. ఇవి బ్యాక్టీరియాను చంపడం, వాటిపెరుగుదలను అడ్డుకోవడం ద్వారా పనిచేస్తాయి. వైరస్‌, ఫంగస్‌, పరాన్న జీవులపై యాంటీ బయోటిక్స్‌ ప్రభావం ఉండదు. సాధారణంగా ఆక్స్‌టెట్రాసైక్లిన్‌, డాక్సిసైక్లిన్‌, ఎన్రోప్లోక్సాసిస్‌, ఫ్లోర్ఫెనికోల్‌, సల్ఫోనామైడ్స్‌, ఫురాజోలైడ్‌ఒన్‌ ఫీడ్‌, నీటిలో కలిపి ఉపయోగిస్తారు. చేపలు, రొయ్యల్లో యాంటీ బయోటిక్స్‌ అవశేషాలు మనుషుల ఆరోగ్యానికి హానికరం. అవశేషాలు ఉన్న ఉత్పత్తులను విదేశాలు తిరస్కరిస్తాయి. మైరెన్‌ ప్రొడక్ట్‌ ఎక్స్‌ఫోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎంపెడా), కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ అథారిటీ (సీఏఏ), ఫుడ్‌ సేప్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ), స్టేట్‌ ఫిషరీష్‌ డిపార్ట్‌మెంట్‌ యాంటీ బ యోటిక్స్‌ నియంత్రణకు కృషి చేస్తున్నాయి.

అవగాహన లేక వినియోగిస్తూ..

ఆక్వా సాగు చెరువులకు వ్యవసాయ, పశుసంవర్థక శాఖలో వినియోగించే మందులను సైతం ఆక్వా రైతులకు అంటగడుతున్నారు. ఉదాహరణకు అ ల్యూమినియం ఫాస్త్ఫెడ్‌ (ఏఐపీ)ని గోడౌన్లలో ఎలుకలు, బొద్దింకలు బస్తాలను పాడు చేయకుండా వినియోగించాలి. అటువంటిది ఆక్వా చెరువుల అడుగున శుభ్రపర్చడానికి ఉపయోగిస్తున్నారు. అలాగే పశుసంవర్థక శాఖకు చెందిన ఆల్బెండజోల్‌, ఫెన్బెండజోల్‌, డాక్సిసైక్లిన్‌, ఆక్సిటెట్రాసైక్లిన్‌, సిప్రోఫ్లోక్సిన్‌, సెఫాలిక్స్‌ కలిసిన మందులను కొన్ని చోట్ల ఆక్వా సాగులో వినియోగిస్తున్నారు.

కై కలూరులో నాసిరకం మందులతో చేపలు చనిపోయాయని ఆందోళన చేస్తున్న రైతులు (ఫైల్‌)

నిషేధిత మందులతో

నీలినీడలు

ప్రభుత్వం నిషేధించిన మందులు విక్రయిస్తే ఆక్వా దుకాణ యజమానులపై చర్యలు తీసుకుంటాం. మొదటి తప్పుగా రూ.25 వేలు జరిమానా విధిస్తాం. ఇటీవల జిల్లాలో నిబంధనలు పాటించని ఆక్వా దుకాణాలపై రూ.2 లక్షల జరిమానాలు విధించాం. త్వరలో ఆక్వా దుకాణాలను డ్రగ్స్‌, ఫిషరీష్‌, రెవెన్యూ, పోలీసు వంటి బృందాలతో సోదాలు చేస్తాం.

– బి.రాజ్‌కుమార్‌,

జిల్లా మత్స్యశాఖ అధికారి, ఏలూరు

నిషేధిత యాంటీ బయోటిక్స్‌ ఉపయోగించద్దు. హేచరీ, ఫారమ్స్‌లో బయో సెక్యూరిటీ పాటించాలి. పర్యావరణ కాలుష్యం, ఎ గుమతి సమస్యలకు యాంటీ బయోటిక్స్‌ కారణం. ప్రో బయోటిక్స్‌ మంచినీటి నిర్వహణ పాటించాలి. మంచి బయో సెక్యూరిటీ, నీటి నాణ్యత నిర్వహణ, ప్రొ బయోటిక్స్‌ వినియోగం ద్వారా యాంటీ బయోటిక్స్‌ అవ సరాన్ని తగ్గించవచ్చు.

– డాక్టర్‌ పి.రామ్మోహనరావు,

మత్స్యశాఖ విశ్రాంత ఉప సంచాలకుడు, కాకినాడ

చోరీ కేసుల్లో ఆరుగురి అరెస్ట్‌ 
1
1/3

చోరీ కేసుల్లో ఆరుగురి అరెస్ట్‌

చోరీ కేసుల్లో ఆరుగురి అరెస్ట్‌ 
2
2/3

చోరీ కేసుల్లో ఆరుగురి అరెస్ట్‌

చోరీ కేసుల్లో ఆరుగురి అరెస్ట్‌ 
3
3/3

చోరీ కేసుల్లో ఆరుగురి అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement