
వక్ఫ్ ఆస్తులకు నోటీసులు
ఆకివీడు: స్థానిక ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ పరిధిలో ఉన్న ముస్లిం కాంప్లెక్స్, మసీదులకు సంబంధించి బుధవారం జిల్లా వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్ ఆడిటర్ కేఎండీ.ఆలీమ్ నోటీసులు అందజేశారు. వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్న ఆస్తులకు సంబంధించి అద్దెలు సక్రమంగా జమ కావడంలేదని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఇకపై నేరుగా అద్దెలు, ఇతర సొమ్ముల జమను తమకే చెల్లించాలని జిల్లా వక్ఫ్‌బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు. ఈమేరకు వక్ఫ్ ఆస్తులకు సంబంధించి నోటీసులు ఇచ్చినట్లు ఆలీమ్ చెప్పారు. స్థానికంగా మూడు మసీదులకు, ఈద్గా, చౌల్ట్రీ, ఇతర షాపులకు సంబంధించి లావాదేవీలు ఇకపై తమ పరిధిలోనే జరుగుతాయని చెప్పారు. కమిటీ ఏర్పాటు చేసేంతవరకూ ఈ విధానం కొనసాగుతుందన్నారు. నోటీసుల్ని ఆలీమ్‌తో పాటు సబార్డినేట్ బహుదూర్ షాపు, మసీదు గోడలపై అతికించారు.
డిపార్టుమెంట్‌కే అద్దె చెల్లించాలని సూచన