పారిశుద్ధ్య కార్మికుల వేతన వెతలు | - | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్య కార్మికుల వేతన వెతలు

Aug 1 2025 11:50 AM | Updated on Aug 1 2025 11:50 AM

పారిశ

పారిశుద్ధ్య కార్మికుల వేతన వెతలు

ఏలూరు టౌన్‌: ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారు. కాంట్రాక్ట్‌ సంస్థ ప్రతినెలా జీతాలు చెల్లించాల్సి ఉండగా.. కార్మికులు ఆందోళనలు చేస్తే తప్ప పట్టించుకోవడం లేదు. అది కూడా ఒక నెల జీతం ఇచ్చి సరిపెడుతున్నారు. దీంతో మూడు నెలలుగా జీతాల బకాయిలు ఉన్నాయని, కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా ఉందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు.

జిల్లాలో 189 మంది..

జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో పారిశుద్ధ్య కార్మికుల కాంట్రాక్ట్‌ను ఫస్ట్‌ అబ్జెక్ట్‌ అనే బెంగళూరుకు చెందిన సంస్థ నిర్వహిస్తోంది. ఏలూరు సర్వజన ఆస్పత్రితో పాటు జంగారెడ్డిగూడెం, నూజివీడు జిల్లా ఆసుపత్రి, కై కలూరు, చింతలపూడి, దెందులూరు, భీమడోలు, పోలవరం ప్రాంతాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో పారిశుద్ధ్య కార్మికులు 189 మంది పనిచేస్తున్నారు. వీరందరికీ మూడు నెలల జీతాలు రావాల్సి ఉంది. ఏలూరులో 90 మంది, జంగారెడ్డిగూడెంలో 20, నూజివీడు జిల్లా ఆసుపత్రిలో 30, కై కలూరులో 15, చింతలపూడిలో 10, దెందులూరు, భీమడోలు, పోలవరం ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్కో చోట 8 మంది చొప్పున కార్మికులు ఉన్నారు.

కాంట్రాక్టర్‌ మార్పుపై చర్చ

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టర్‌ మార్పుపై తీవ్ర చర్చ సాగుతోంది. ప్రస్తుత కాంట్రాక్టర్‌ కార్మి కులకు జీతాలు చెల్లించటంలో జాప్యం చేస్తున్నట్టు తెలుస్తోంది. తమకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయటం లేదనీ, తాము మాత్రం ఎక్కడి నుంచి తీసుకువచ్చి ఇస్తామనే ధోరణిలో కాంట్రాక్ట్‌ సంస్థ యజమానులు వ్యవహరిస్తున్నారని కార్మికులు అంటున్నారు. కార్మికులకు గత నెలలో కొంత బకాయిలు చెల్లించగా మిగిలిన మూడు నెలల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఆస్పత్రుల్లో కార్మికులకు 3 నెలలుగా జీత బకాయిలు

కాంట్రాక్టర్‌ జాప్యంతో ఇబ్బందులు

బకాయిలు చెల్లించాలి

ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి. పారిశుద్ధ్య కార్మికులు కష్టమైన పనులు చేస్తున్నా కుటుంబాలను పోషించుకోలేని దుస్థితిలో ఉన్నారు. గతంలో కాంట్రాక్టర్‌పై అధికారులు ఒత్తిడి తీసుకువచ్చినా ఇంకా మూడు నెలల బకాయిలు ఉన్నాయి.

– వి.దత్తాత్రేయ, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ మెడికల్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌

కాంట్రాక్ట్‌ సంస్థ, అధికారులపైఒత్తిడి తెచ్చాం

కాంట్రాక్ట్‌ సంస్థ యాజమాన్యం, అధికారులతో చర్చించి కొంత బకాయిలు చెల్లించేలా ఒత్తిడి తెచ్చాం. దీంతో ఏలూరు జీజీహెచ్‌లో కార్మికులకు ఒక నెల జీతం వేశారు. ఇంకా మూడు నెలల జీతాల బకాయిలు ఉన్నాయి. ఇదే పరిస్థితి ఉంటే మరోసారి పోరాటానికి సిద్ధమవుతాం.

– కృష్ణమాచార్యులు, ఏపీ మెడికల్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌

పారిశుద్ధ్య కార్మికుల వేతన వెతలు 1
1/2

పారిశుద్ధ్య కార్మికుల వేతన వెతలు

పారిశుద్ధ్య కార్మికుల వేతన వెతలు 2
2/2

పారిశుద్ధ్య కార్మికుల వేతన వెతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement