టీచర్లకు ఈ నెలా ఎగనామమే | - | Sakshi
Sakshi News home page

టీచర్లకు ఈ నెలా ఎగనామమే

Aug 2 2025 7:06 AM | Updated on Aug 2 2025 7:06 AM

టీచర్

టీచర్లకు ఈ నెలా ఎగనామమే

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కూటమి ప్రభుత్వం బదిలీ ఉపాధ్యాయులకు ఈ నెలా మొండిచేయే చూపింది. టీచర్ల బదిలీల ప్రక్రియ పూర్తిచేసిన ప్రభుత్వం.. బదిలీలు అయిన ఉపాధ్యాయులకు మాత్రం జీతాల చెల్లింపులో పూర్తిగా విఫలమైంది. దీనిపై ఉపాధ్యాయులు ఆందోళనలు, నిరసనలు చేపట్టినా సర్కారులో చలనం లేదు. ఈనెల 1న జీతాలు వస్తాయని ఎదురుచూసిన ఉపాధ్యాయులకు భంగపాటే ఎదురైంది.

కొందరికే పొజిషన్‌ ఐడీలు

సాధారణంగా బదిలీ అయిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు వారు బదిలీ అయిన ప్రాంతాల్లో జీతాలు తీసుకునేలా అక్కడి డీడీఓకు సమాచారం అందించాలి. దీని నిమిత్తం పొజిషన్‌ ఐడీలు కేటాయించాలి. గత నెల 15వ తేదీ లోపు అన్ని కేడర్ల ఉపాధ్యాయుల బదిలీలను పూర్తి చేశారు. బదిలీలు పూర్తి చేసి నెల రోజులు దా టుతున్నా క్లియర్‌ వేకెన్సీల్లోకి బదిలీ అయిన వారికి మాత్రమే పొజిషన్‌ ఐడీలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం కొత్తగా సృష్టించిన పీఎస్‌ హెచ్‌ఎం, రీపోర్షన్‌మెంట్‌లో కొత్తగా ఏర్పడిన పాఠశాలలకు బదిలీ అయిన ఉపాధ్యాయులకు మాత్రం ఇప్పటికీ పొజిషన్‌ ఐడీలు కేటాయించలేదు. దీంతో జూన్‌, జూలై నెలలకు సంబంధించి ఆగస్టు నెలలో రావాల్సిన జీతాలు ఉపాధ్యాయులకు అందలేదు.

వచ్చే నెలా అనుమానమే..

ఉపాధ్యాయులను బదిలీ చేసిన తర్వాత కేడర్‌ స్ట్రెంగ్త్‌ను నిర్ధారించి ఆ వివరాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ కార్యాలయం డైరెక్టరేట్‌ ఆప్‌ ట్రెజరీ అండ్‌ ఆడిట్‌కు అందించాలి. అయితే పాఠశాల విద్యాశాఖ ఇప్పటికీ ఆ పని చేయలేదు. కేడర్‌ స్ట్రెంగ్త్‌ అయిన తర్వాతే ఉపాధ్యాయులకు పొజిషన్‌ ఐడీలు కేటాయించే అవకాశం ఉంది. బదిలీ అయిన ఉపాధ్యాయులకు జూన్‌, జూలై నెలలకు సంబంధించి జీతాలు ఏరియర్‌ బకాయిలతో ఈనెల 10వ తేదీలోపు ట్రెజరీకి బిల్లులు పెడితేనే ఈ నెలలో జీతాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈనెల 10లోపు ఈ ప్రక్రియ పూర్తికాకుంటే బదిలీ అయిన టీచర్లకు జూన్‌, జూలైతో పాటు ఆగస్టు నెలకు సంబంధించిన జీతాలు కూడా సెప్టెంబర్‌లో పడే అవకాశం ఉండదని ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా జీతాలు లేకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించాల్సి వస్తోందని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు.

బదిలీ ఉపాధ్యాయులకు రెండు నెలలుగా జీతాల్లేవు

ఇప్పటికీ కేటాయించని పొజిషన్‌ ఐడీలు

ప్రభుత్వం విఫలం

బదిలీ అయిన ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఒక నెల జీతాలు చెల్లించలేదంటే సాంకేతికలోపమో, పని ఒత్తిడో అని సరిపెట్టుకోవచ్చు. కానీ రెండు నెలల జీతాలు ఆపడం అంటే సీఎస్‌ఈ నిర్లక్ష్యంగానే భావించాల్సి ఉంటుంది. ఇప్పటికై నా సకాలంలో బిల్లులు చేసి జీతాలు చెల్లించాలి.

– గుగ్గులోతు కృష్ణ, ఏపీటీఎఫ్‌ 1938 రాష్ట్ర అకడమిక్‌ కన్వీనర్‌

ఉపాధ్యాయులపై కక్ష

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోంది. బోధనేతర పను లు అప్పగిస్తూ ఇబ్బందులకు గురిచేస్తోంది. అనేక రకాల లక్ష్యలు, యాప్‌ల అప్‌లోడ్‌ వంటి పనులు అప్పగించడం వారిని అవమానించడానికే. జీతాల చెల్లింపులో అలసత్వంపై ఉపా ధ్యాయ లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

– గెడ్డం సుధీర్‌, వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

టీచర్లకు ఈ నెలా ఎగనామమే1
1/2

టీచర్లకు ఈ నెలా ఎగనామమే

టీచర్లకు ఈ నెలా ఎగనామమే2
2/2

టీచర్లకు ఈ నెలా ఎగనామమే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement