గీత రాత మారేనా? | - | Sakshi
Sakshi News home page

గీత రాత మారేనా?

Aug 1 2025 11:50 AM | Updated on Aug 1 2025 11:50 AM

గీత ర

గీత రాత మారేనా?

గత ప్రభుత్వంలో ఆపన్న హస్తం

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గీత కార్మికులకు ఆపన్న హస్తం అందించింది. నాటి సీఎం వైఎస్‌ జగన్‌ నూతన ఎకై ్సజ్‌ పాలసీ తీసుకువచ్చారు. గీత పన్ను రద్దు చేశారు. కల్లు గీత కా ర్మిక సొసైటీలు, గీత గీచే వారికి చెట్టు పథకం అమలు చేశారు. కల్లు తీస్తూ ప్రమాదానికి గురై శాశ్వత వైకల్యం పొందితే నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ ఇప్పించి ప్రత్యామ్నాయ ఆదా య మార్గాలను చూపించారు. వైఎస్సార్‌ బీ మా పథకం ద్వారా నష్టపరిహారం చెల్లించారు. ప్రమాదాల్లో మరణిస్తే ఇచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. ఎన్‌ఈఆర్‌జీఎస్‌, షెల్టర్‌ బెడ్‌ అభివృద్ధి పథకాల ద్వారా తాటి, ఈత వంటి చెట్లు పెంచేలా చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా కాలువ గట్లు, నదీ, సాగర తీరాలను పటిష్టం చేస్తూ కల్లు గీతకు కావాల్సిన తాటి, ఈత చెట్లు సమృద్ధిగా పెరిగేలా చర్యలు తీసుకున్నారని గీత కార్మికులు గుర్తుచేసుకుంటున్నారు.

ఏలూరు (టూటౌన్‌): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కల్లు గీత కార్మికులు తమ రాత మారేనా.. కష్టాలు తీరేనా అని ఎదురుచూస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తమ జీవితాల్లో వెలుగులు నింపితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వేదనను మిగిలుస్తోందని ఆందోళన చెందుతున్నారు. ఊరూ వాడా బెల్టు షాపులు, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలతో గీత వృత్తి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సుమారు 9 వేల బెల్టుషాపులు ఉన్నాయని గీత కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో హామీలు గుప్పించిన కూటమి నాయకులు గద్దెనెక్కిన తర్వాత తమను పట్టించుకోవడం లేదని అంటున్నారు. కల్లుగీత వృత్తిపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 25 వేల మంది కార్మికులు ఆధారపడి ఉన్నారంటున్నారు.

9 వేలకు పైగా బెల్టు షాపులు

ఏలూరు జిల్లావ్యాప్తంగా సుమారు 5 వేలు, పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా సుమారు 4 వేలు బెల్టుషాపులు ఉన్నాయి. కూటమి నాయకులు, వారి అనుచరులే బెల్టుషాపులను నిర్వహిస్తున్నారని, దీంతో గీత వృత్తి కనుమరుగయ్యే ప్రమాదం గీత కా ర్మికులు ఉందని ఆవేదన చెందుతున్నారు. బెల్టు షాపులపై కొరడా ఝుళిపిస్తామని ముఖ్యమంత్రి, ఎకై ్సజ్‌ మంత్రి ప్రకటనలు చేయడం తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ సమస్యల పరిష్కారం కోసం గీత కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే సర్కిల్‌ వారీగా సభలు, సమావేశాలు నిర్వహించిన కార్మికులు ఆందోళనను ఉధృతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈనెల 18న ఏలూరు కలెక్టరేట్‌ వద్ద భారీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

కల్తీ మద్యం హల్‌చల్‌!

ఉమ్మడి జిల్లాలో కల్తీ మద్యం హల్‌చల్‌ చేస్తున్నట్లు గీత కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. గోవా, యానాం నుంచి అక్రమ మద్యం తీసుకు వస్తున్నారని చెబుతున్నారు. అనకాపల్లి, పరవాడ కేంద్రంగా కబళిస్తున్న కల్తీ మద్యం రాకెట్‌ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లును స్థావరంగా చేసుకుందని అంటున్నారు. పాలకొల్లులో కల్తీ మద్యం తయారుచేసి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కాకినాడ జిల్లాలకు సరఫరా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నా అధికారులు స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. బెల్టు షాపుల్లో అధికంగా కల్తీ మద్యం విక్రయిస్తున్నారని, హైదరాబాద్‌ నుంచి స్పిరిట్‌ను తీసుకువచ్చి రంగు నీళ్లు కలిపి మద్యంగా తయారు చేసి బ్రాండెడ్‌ కంపెనీల బాటిల్స్‌లో నింపి ప్రముఖ బ్రాండ్ల లేబుల్‌ అతికించి షాపుల్లో విక్రయిస్తున్నారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ము ఖ్య నేత అనుచరుడే కల్తీ మద్యం దందా నడుపుతు న్నట్టు విస్తృత ప్రచారం జరుగుతోందని గీత కార్మి కుల నాయకులు ఆరోపిస్తున్నారు.

కూటమి మొండిచేయి

గీత కార్మికులకు ఇచ్చిన హామీల అమలెప్పుడు?

ఏడాది దాటినా పట్టించుకోని కూటమి సర్కారు

వాడవాడలా బెల్టు షాపులు

ఉమ్మడి జిల్లాలో కల్లుగీత ఛిన్నాభిన్నం

సుమారు 25 వేల మంది కార్మికులకు కష్టం

గీత రాత మారేనా?1
1/1

గీత రాత మారేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement